»   » బాలయ్య కంటే మహేష్ బాబు పేదోడేనంట, ఆస్తుల్లో టాప్-5 ఎవరు?

బాలయ్య కంటే మహేష్ బాబు పేదోడేనంట, ఆస్తుల్లో టాప్-5 ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా స్టార్లకు సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరమే. వారి పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి, వారి అలవాట్లు, అభిరుచుల గురించి, తీసుకునే రెమ్యూనరేషన్, సినిమాలే కాకుండా ఇతర మార్గాల్లో వారి సంపాదన, ఆస్తుల వివరాలు గట్రా వంటివి తెలుసుకోవడానికి సమాన్య జనాలు ఆసక్తి చూపుతుంటారు.

అయితే సామాన్య జనాల ఆసక్తికి వ్యతిరేకంగా ఒక్క సినిమాలకు సంబంధించిన విషయాలు తప్ప.... మిగతా అన్ని విషయాల గురించి వీలైనంత గోప్యత ప్రదర్శిస్తుంటారు సెలబ్రిటీలు. దీంతో ఊహాగానాలు, గాసిప్స్ వంటివి తెరపైకి వస్తుంటారు.

గతంలో మనం వివిద స్టార్లకు సంబంధించి రెమ్యూనరేషన్ వివరాలు రకరకాల సందర్భాల్లో రకరకాలుగా విన్నాం. అయితే ఏ నాడూ ఏ హీరో కూడా తాను ఇన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగానీ ప్రకటించింది లేదు. దర్శక నిర్మాతలు కూడా ఈ విషయాలను ఎక్కడ స్పందించరు.

దీంతో ఇండస్ట్రీలో ఏ హీరో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనే విషయాలపై ఓ క్లారిటీ అంటూ లేకుండా పోతోంది. ఎవరికి వారు మా హీరో ఇంత తీసుకుంటున్నాడు. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఊహించుకోవడమే. గతంలో ఇలాంటి విషయాలపై చాలా ప్రచారాలు విన్నాం.

తాజాగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టార్ల ఆస్తుల వివరాలపై కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నారు. అయితే వారికి ఉన్న ప్రాపర్టీల పరంగా ఆస్తులను లెక్కేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో ఉన్న స్టార్ల ఆస్తులు వేల కోట్లపైనే ఉండటం గమనార్హం. అందరికంటే ఎక్కువ ఆస్తులతో నాగార్జున నెం. 1 స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెం.1 స్లార్ మహేష్ బాబు మాత్రం 5వ స్థానంలో ఉన్నారట. అయితే ఇవన్నీ ఊహాగానాలే తప్ప....అఫీషియల్ వివరాలు కావు.

స్లైడ్ షోలో ఆస్తుల వివరాలు...

నాగార్జున

నాగార్జున


నాగార్జునకు అన్నపూర్ణ స్టూడియో, సినిమా వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఆయన ఆస్తి రూ. 3000 కోట్లు ఉంటుందని అంటున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్


మెగాస్టార్ చిరంజీవి తనయుడైన రామ్ చరణ్.... అపోలో సంస్థల చైర్మైన్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసనను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇపుడు ఎయిర్ లైన్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. అన్ని కలుపుకుంటే చెర్రీ ఆస్తుల విలువ రూ. 2800 కోట్లు ఉంటుందని అంచనా.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


నందమూరి ఫ్యామిలీ హీరో ఎన్టీఆర్ అప్పట్లో స్టూడియో ఎన్ అధినేత కూతురైన ప్రణతిని పెళ్లాడారు. ఎన్టీఆర్ ఆస్తుల విలువ సుమారుగా రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా.

బాలయ్య

బాలయ్య


తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన బాలయ్య ఆస్తుల విలువ రూ. 800 కోట్ల వరకు ఉంటుందట. బాలయ్యకు సినిమాలు తప్ప వేరే వ్యాపారాలు ఏమీ లేవు.

మహేష్ బాబు

మహేష్ బాబు


ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో మహేష్ బాబే. వ్యాపార ప్రకటనల ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నారు. అయితే ఆస్తుల విషయంలో మాత్రం మిగతా స్టార్ల కంటే వెనకే ఉన్నారట. టాలీవుడ్లో మిగతా హీరోలైన బన్నీ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లకు కూడా ఆస్తులు ఉన్నాయి కానీ మొదటి ఐదుగురు తర్వాతే వీరంతా అంటున్నారు.

English summary
Tollywood heroes Nagarjuna, Ram Charan, Jr NTR, Balakrishna, Mahesh Babu's properties cost details out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu