»   » కథ వినకుండానే ముఖం చాటేసిన అగ్ర హీరోలు.. డైరెక్టర్‌కు షాక్

కథ వినకుండానే ముఖం చాటేసిన అగ్ర హీరోలు.. డైరెక్టర్‌కు షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయం అందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది. పరాజయం అధోపాతాళానికి తొక్కుతుంది. ఈ నానుడి సినీ పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ఇదే. 'కొత్త బంగారం లోకం' మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా శ్రీకాంత్ పేరు తెచ్చుకొన్నారు. ఇంటిల్లిపాది చూసే చిత్రాలను రూపొందిస్తారనే క్రెడిట్‌ను కొట్టేశారు. కానీ ఒక్క సినిమా ఆయన ఫేట్‌ను తిరగరాసింది.

బ్రహ్మోత్సవంతో పరిస్థితి తారుమారు

బ్రహ్మోత్సవంతో పరిస్థితి తారుమారు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం శ్రీకాంత్‌కు మంచి విజయాన్ని అందించింది. ఈ చిత్రం ద్వారా మల్టీ స్టారర్ చిత్రాలను తీయగలడనే నమ్మకాన్ని సినీ పరిశ్రమకు కల్పించారు. కానీ బ్రహ్మోత్సవం లాంటి దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్న తర్వాత పరిస్థితి తారుమారైంది.

నమ్మకంతోనే మహేశ్ గ్రీన్ సిగ్నల్

నమ్మకంతోనే మహేశ్ గ్రీన్ సిగ్నల్

‘సీతమ్మ' చిత్రంతో శ్రీకాంత్‌పై పెరిగిన నమ్మకం కారణంగా బ్రహ్మోత్సవం కథ వినకుండానే ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాను ఓకే చేశారట. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి నమ్మకాన్నే ప్రిన్స్ పెట్టుకొన్నారు. సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి మహేశ్‌కు చేదు అనుభవాన్ని, భారీ నష్టాలను మిగిల్చింది. ఓ దశలో బ్రహ్మోత్సవం చేయడం తన తప్పేనని ఆ ఫ్లాప్‌ను మహేశ్ తనమీద వేసుకొన్నాడు.

కెరీర్‌కే మచ్చగా బ్రహ్మోత్సవం

కెరీర్‌కే మచ్చగా బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం చిత్రం పరిశ్రమలో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. మంచి జోరుమీద ఉన్న మహేశ్ కెరీర్‌కు మచ్చగా మిగిలింది. ఈ విజయం ఫ్లాప్ కావడంతో అన్నివేళ్లు శ్రీకాంత్ అడ్డాల వైపే చూపించాయి. బ్రహ్మోత్సవం చిత్రం పరాజయం తర్వాత ఏ హీరో కూడా శ్రీకాంత్‌తో పనిచేయడానికి ఆసక్తిని చూపలేదు.

శ్రీకాంత్‌కు నో చెప్పిన ఐదుగురు హీరోలు

శ్రీకాంత్‌కు నో చెప్పిన ఐదుగురు హీరోలు

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఫిలింనగర్‌లో ఓ రూమర్ ప్రచారం జరుగుతున్నది. ఇటీవల శ్రీకాంత్ అడ్డాల మరో చిత్రం కోసం పలువురు హీరోలను సంప్రదించినట్టు సమాచారం. అయితే కథ వినకుండానే దాదాపు ఐదుగురు అగ్రహీరోలు శ్రీకాంత్ అడ్డాలను తిరస్కరించారట. తమ కెరీర్‌ను పణంగా పెట్టలేమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఆ ఐదుగురు హీరోలు ఎవరూ అనే విషయం బయటకు రాలేదు.

పెద్ద నిర్మాత ముందుకు వస్తేనే..

పెద్ద నిర్మాత ముందుకు వస్తేనే..

ఈ నేపథ్యంలో ఈసారైనా పక్కా కథతో శ్రీకాంత్ సిద్ధమవ్వాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పరిశ్రమలోని పెద్ద హీరోను ఒప్పించే ఓ పెద్ద నిర్మాతకు నమ్మకం కలిగిస్తే తప్ప ప్రాజెక్ట్ వర్కవుట్ కాదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరున్న శ్రీకాంత్‌కు మంచి అవకాశం లభిస్తే బాగుంటుందనే కోరుకొంటున్నారు.

English summary
Director Srikanth Addala has recently approached a few of the lead actors in the Telugu film industry. No Top hero is not even ready to talk to him as they are fearing after Brahmotsavam Flop.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu