»   » ఈ రోజు జరగబోవు పవన్ 'తీన్ మార్'ఆడియోలో ఓ మెగా అట్రాక్షన్..!

ఈ రోజు జరగబోవు పవన్ 'తీన్ మార్'ఆడియోలో ఓ మెగా అట్రాక్షన్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఇలియానా నటించిన చిత్రం 'శక్తి" త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో వేడుకలో ఇలియానా డ్యాన్స్ ఫెర్ ఫ్మామ్ చేసిన సంగతి తెలిసిందే ఇది ఆడియో ఫంక్షన్ కే హైలెట్ అయ్యింది నందమూరి అభిమానులు ఇలియానా డ్యాన్స్ ను తిలకించి తెగ పులకించిపోయారు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'తీన్ మార్" ఆడియో వేడుక ఈ రోజు శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మా మూవీ టివి చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. పవన్ కళ్యాణ్, త్రిష తో పాటు సినిమా కు పనిచేసిన నటినటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారని సమాచారం. ఈ ఆడియో వేడుకలో ఈ చిత్రంలో కథానాయికగా నటించిన త్రిష ఓ డ్యాన్స్ కి ఫెర్ ఫామ్ చేయనుందని సమాచారం. ఇది ఖచ్చితంగా ఈ వేడుకకు హాజరవుతున్న మెగా అభిమానులకు ఓ స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.

పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ ఫై గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని స్వరపరిచిన ఈ ఆల్బంలో చిరంజీని ఒక నాటి హిట్ సాంగ్' చిలుక క్షేమమ' పాటను రిమిక్స్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ రెండు విబిన్న పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా హిందీ చిత్రం 'లవ్ అజ్ కల్' కు రీమేక్ గా తెరకెక్కింది.

English summary
Recently, Ileana and NTR performed on stage at the audio launch of their film, Shakti. Now, Trisha has agreed to do a dance number to make the audio ceremony more eventful.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu