»   » బాలకృష్ణ అనేసరికి భారీగానే పెంచేసింది

బాలకృష్ణ అనేసరికి భారీగానే పెంచేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ ప్రక్కన హీరోయిన్స్ గా చేయటానికి సరైన వాళ్లు గత కొంతకాలంగా దొరకటం లేదు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ దీనికి సమస్యగా మారుతోంది. కొత్త హీరోయిన్స్ ని తీసుకు వద్దామంటే వారు బాలకృష్ణ ప్రక్కన చిన్న పిల్లల్లా కనపడుతున్నారు. అలాగని ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కి తాము ఒక్కసారి సీనియర్స్ తో చేస్తే ... యంగ్ హీరోల ప్రక్కన ఆఫర్ రావని నో చెప్పేస్తున్నారు. దాంతో సీనియర్ హీరోయిన్స్ వైపు బాలకృష్ణ కి చెందిన దర్శక,నిర్మాతల చూపు మరులుతోంది. అందులో భాగంగా ఆయన సరసన త్రిష ని ఒప్పించారు. ఇందుకుగాను ఆమెకు భారీ పారితోషికాన్ని ఇచ్చారని సమాచారం. కోటి పాతిక లక్షలు వరకూ డిమాండ్ చేసిందని తెలుస్తోంది.

గతకొంతకాలంగా ఎన్నికల హడావుడిలో ఉన్న నందమూరి బాలకృష్ణ త్వరలో ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.ఈ సినిమాను వచ్చే నెల 2న హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభిస్తారు. రుద్రపాటి రమణారావు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇందులో బాలకృష్ణ సరసన త్రిషను ఎంపిక చేశారు.

Trisha demanded a huge remuneration

''బాలకృష్ణ నుంచి రాబోతున్న మరో పవర్‌ఫుల్‌ చిత్రమిది. దర్శకుడు మంచి కథను సిద్ధం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి'' అంటున్నారు నిర్మాతలు. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్‌ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

English summary
Balakrishna signed up with debutant director for a new movie. Makers are showing interest to rope in actress Trisha Krishnan for the female lead. However, Trisha shocked the makers by demanded a huge remuneration of 1.25 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu