Just In
- 4 min ago
ఆయనలో నచ్చింది అదే.. ఇంకెవ్వరిలోనూ చూడలేదు.. ‘తొలిప్రేమ’ వాసుకి కామెంట్స్
- 28 min ago
మాజీ భర్త గిఫ్టుగా అరుదైన పెయిటింగ్. రికార్డు ధరకు వేలం వేసిన ఎంజెలీనా జోలి
- 30 min ago
పవన్ సినిమా నుంచి తప్పుకున్న సాయి పల్లవి: క్లారిటీ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్
- 37 min ago
ఎన్టీఆర్ సినిమా కోసం మరో యువ హీరో.. పవర్ఫుల్ రోల్ కోసం త్రివిక్రమ్ హై వోల్టేజ్ ప్లాన్!
Don't Miss!
- News
దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం... ఘన్పూర్ వద్ద బోగీల నుంచి విడిపోయిన ఇంజిన్...
- Sports
IPL 2021: మార్చి 11 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ షురూ.. ధోనీ, రైనా హాజరు!
- Finance
కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్! పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు ఛాన్స్!!
- Lifestyle
తెల్లజుట్టు ఉందా?ఈ 5 హోం రెమెడీస్ హెయిర్ డైస్ మరియు హెయిర్ కలర్స్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి
- Automobiles
కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగాస్టార్ చిరంజీవితో మరోసారి త్రిష.. విజయశాంతి, నయనతార రిజెక్ట్ చేసిన పాత్రలో..
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారడం ఒక కారణమైతే.. లాక్‌డౌన్ కారణంగా మరో ఏడాది గ్యాప్ రావడం మరో కారణమైంది. అయితే తాజాగా మెగా క్యాంపులో ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది. త్రిషా మూవీ వివరాల్లోకి వెళితే..
అర్ధనగ్నంగా కుర్ర హీరోయిన్.. ఎదకు పూలను అడ్డం పెట్టుకొంటూ..

ఆచార్య నుంచి తప్పుకోవడం
వాస్తవానికి గతేడాది చిరంజీవి సరసన ఆచార్యలో నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే దర్శకుడు కొరటాల శివతో విభేదాల కారణంగా తప్పుకొన్నారని, అందుకే ఆచార్యలో నటించే అవకాశం రాలేదని వార్త కథనాలు వెలువడ్డాయి. ఆ స్థానంలో కాజల్ అగర్వాల్ ఆ రోల్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే.

లూసిఫర్ రీమేక్‌లో నటించడానికి
ప్రస్తుతం లూసిఫర్ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన మోహన్‌లాల్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిషా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

చిరంజీవికి చెల్లెలుగా నటిస్తున్నాదా?
లూసిఫర్ చిత్రంలో కీలకంగా ఉండే చిరంజీవి సరసన ఓ చెల్లెలు పాత్ర కోసం తొలుత లేడి అమితాబ్ విజయశాంతి, నయనతారను సంప్రదించారు. అయితే చెల్లెలి పాత్రకు సరిపోవమని నిరాకరించారు. దాంతో త్రిషాను సంప్రదించగా, ఆమె ఒప్పుకొన్నట్టు తెలిసింది.

స్టాలిన్ తర్వాత మరోసారి
చిరంజీవితో త్రిషా కృష్ణన్ నటిస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. గతంలో స్టాలిన్ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్రిషా ఇప్పుడు చెల్లెలి పాత్రలో నటిస్తుండటం ఆసక్తిగా మారింది. అయితే ఈ వార్త నిజమా? రూమరా అనేది కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

త్రిషా కృష్ణన్ కెరీర్ గురించి
ఇక త్రిషా కెరీర్ విషయానికి వస్తే... గత రెండేళ్లుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 96, పెట్టా చిత్రాల సక్సెస్‌తో జోష్‌ను కొనసాగిస్తున్నారు. తమిళంలో పరంపదం విలయట్టు, గర్జనై, చతురంగ వేట్టై 3, రాంగీ, షుగర్, రామ్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటిస్తున్నారు.