25వ సినిమా కోసం జూ ఎన్టీఆర్ స్పెషల్ ప్లాన్?

By Bojja Kumar

Trivikram next movie with Jr NTR?
హైదరాబాద్: ప్రస్తతం జూ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా యంగ్ టైగర్ కెరీర్లో హీరోగా 24వ సినిమా. దీని తర్వాత చేయబోయే 25వ సినిమా స్పెషల్‌గా ఉండాలని జూ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్న ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అత్తారింటికి దారేది' చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌తో చేసే సినిమా మొదలు పెట్టనున్నాడు. దసరాకి ప్రారంభమై 2015 వేసవిలోగానీ, ఆ తర్వాతగానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రభస చిత్రం వివరాల్లోకి వెళితే...
జూ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న రభస(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో ఉంది. సమంత, ప్రణీత హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X