»   » బన్నీ కోసం హిందీ సినిమాని ఎత్తేస్తున్నాడా?

బన్నీ కోసం హిందీ సినిమాని ఎత్తేస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Trivikram to remake Bachna Ae Haseeno
హైదరాబాద్: త్రివిక్రమ్ చిత్రాలపై బాలీవుడ్,హాలీవుడ్ చిత్రాల ప్రభావం చాలా ఉంటుందనేది అందరూ ఒప్పుకుంటారు. అయితే చక్కగా వాటని మన నేటివిటికి తగ్గట్లుగా ఎడాప్ట్ చేసి హిట్ కొడుతూంటారు. తాజాగా ఆయన బన్నితో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. దాంతో మరోసారి కాపీ రూమర్స్ ఆయనపై మొదలయ్యాయి. ఈ సారి ఓ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని ఆయన ప్రేరణగా తీసుకుని కథ అల్లాడని అంటున్నారు. అది మరోదో కాదు బచ్‌నా ఏ హసీనో.

ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్స్ బుక్ చేయటం ఈ రూమర్స్ మొదలవటానికి కారణమైంది. వారు సమంత, కృతి సనమ్(నేనొక్కిడినే ఫేమ్), ప్రణీత అని సమాచారం. అత్తారింటికి దారేదిలో నటించిన సమంత, ప్రణీత లు ఈ చిత్రంలో మళ్లీ తీసుకోవటంతో లక్కి పెయిర్ గా భావిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్ తీసుకోవటంతో బాలీవుడ్ సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ బచ్‌నా ఏ హసీనో సినిమాకు ఫ్రీమేక్‌గా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చేయబోతున్నాడంటూ రూమర్స్ మొదలయ్యాయి. అయితే అంతలా అందరికీ తెలిసింది కాపీ కొట్టే ధైర్యం ఎవరు చేస్తారని కొందరు కొట్టిపారేస్తున్నారు.

రేసుగుర్రం హిట్‌తో మంచి జోష్‌ మీదున్న అల్లుఅర్జున్‌ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. అందుకే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్‌లని ఫైనల్‌ చేశారని తెలిసింది. అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సమంతా, ప్రణీతలను ఈ సినిమాకు త్రివిక్రమ్‌ కంటిన్యూ చేస్తున్నాడు.

మహేష్‌ నటించిన వన్‌ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతిసనన్‌ని మూడవ హీరోయిన్‌గా ఎంపిక చేశారట. జులాయి చిత్రాన్ని నిర్మించిన ఎస్‌.రాధాకృష్ణ హారిక అండ్గ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించనుండగా అల్లు అరవింద్‌ ఈ చిత్రం నిర్మాణంలో భాగ స్వామిగా వ్యవహరిస్తున్నారు.

English summary
Trivikram and Bunny are working on a project. But now it is being rumored that the movie is going to be a remake of Bollywood hit and Ranbir Kapoor starrer, Bachna Ae Haseeno. Samantha - Pranita - Kriti Sanon might be paired with Bunny for his next with Trivikram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu