»   »  పవన్ 'తీన్ మార్' ఫీట్ మళ్లీ

పవన్ 'తీన్ మార్' ఫీట్ మళ్లీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ మళ్లీ 'తీన్ మార్' ఫీట్ ని రిపీట్ చేస్తున్నాడా అంటే అవుననే చెప్తున్నాయి సినీ వర్గాలు. పవన్ హీరోగా చేసిన తీన్ మార్ చిత్రం...ఓ రీమేక్. ఆ చిత్రానికి డైలాగులు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ తో ఉన్న స్నేహంతో...త్రివిక్రమ్ కాదనుకుండా వెంటనే డైలాగులు రాసి పాడేసాడు. ఇప్పుడు గోపాల గోపాల కూడా త్రివిక్రమ్ డైలాగుల సహాయం చేస్తున్నాడని సమాచారం. స్క్రిప్టు చదివిన పనవ్...తన పాత్రకు డైలాగులు మాత్రం డెప్త్ గా ఉండాలని అందుకు త్రివిక్రమ్ సరైన వాడని పిలిచి అప్పచెప్పాడని చెప్పుకుంటున్నారు. అలాగే గతంలో వెంకటేష్ సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు తెరపై మరిన్ని మల్టీస్టారర్‌ సినిమాలకు సమయం ఆసన్నమైంది- ఇటీవల స్టార్‌ హీరోల నోటి నుంచి వస్తోన్న మాట ఇది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎవడు' తర్వాత ఇలాంటి ప్రయత్నాలు వూపందుకున్నాయి. అందులో భాగంగానే వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్‌' సినిమాను వీరిద్దరూ తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో 'గోపాల గోపాల' అనే పేరును నిర్ణయించారు.

Trivikram working for Pawan's Gopala..Gopala…

వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు.

ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి

English summary

 Giving his association with venkatesh and Pawan kalyan Trivikram reportedly accepted the offer and already rewrote some of the scenes and dialogues in the movie. Trivikram earlier worked for the script of Pawan Kalyan’s Teenmaar too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu