»   » మహేష్ ఇలా దొరికిపోయేడేంటి? తెగ జోక్స్ వేస్తున్నారే

మహేష్ ఇలా దొరికిపోయేడేంటి? తెగ జోక్స్ వేస్తున్నారే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాజాగా మురగదాస్ దర్సకత్వంలో మహేష్‌ నటిస్తున్న చిత్రానికి పలు టైటిళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసింమదే. కొందరు 'అభిమన్యుడు' అని, మరికొందరు 'ఏజెంట్‌ శివ‌' అని అంటున్నారు. అయితే ఏజెంట్ శివ టైటిల్ ..ఖరారు అయ్యే అవకాసం ఉందని టాక్ వస్తున్న నేపధ్యంలో ఈ టైటిల్ పై అనేక జోక్స్ పేలుతున్నాయి సోషల్ మీడియాలో.

ఒకరు ఈ టైటిల్ విషయమై ట్వీట్ చేస్తూ... "హాలీవుడ్ మూవి డబ్బింగ్ టైటిల్ లాగ ఉంది, ఏజెంట్ శివ ", అని ఒకరు ట్వీట్ చేస్తే...

మరకొరరు.."హీరో అభిబస్ అంటూంటే డైరక్టర్ ఎర్రబస్ అంటున్నట్లు ఉంది ఈ టైటిల్ ఏజెంట్ శివ ," అంటూ ఈ టైటిల్ అవుట్ డేటెడ్ అనే విషయం అన్యాపదేశంగా చెప్పారు.

మరొకరు ఏమిట్వీట్ చేసారంటే.."ఏజెంట్ శివ టైటిల్ ఖరారు! మహేష్ వాళ్లింట్లో పనిమనిషిగా చేసే మా పనిమనిషి కజిన్ .. ఈ టైటిల్ కన్ఫర్మ్ చేసి చెప్పింది!" అంటూ మీడియాపై సెటైర్స్ వేసారు. ఇలా ట్విట్టర్ ఫేస్ బుక్ లలో ఈ టైటిల్ పై జోక్స్ కంటిన్యూగా పేలుతూనే ఉన్నాయి.

మురుగదాస్‌ మాత్రం ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ రూ.25 కోట్ల మొత్తానికి అమ్ముడుపోయానని సమాచారం.

మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం టైటిల్ గురించే టెన్సన్ గా వున్నారు టీం. ఫస్ట్ లుకు విడుదల చెయ్యడానికి ఈ కారణమే అడ్డుగా వున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu

ఈ సినిమాకు ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కానప్పటికీ 'ఏజెంట్ శివ' అనే టైటిల్ తో చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఏది ఎమైనా ఈ దీపావళికి ఫ్యాన్స్ అందరు పండగ చేసుకునేలా టైటిల్ ఖరారు చేస్తూ పది సెకెండ్ల టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లోని ఓ కంపెనీ దీన్ని తయారుచేస్తుందని వినికిడి. ఈ టీజర్ కోసం భారిగా ఖర్చు పెడుతున్నారట. సో ..అప్పటివరకు అగవలసిందే అసలు టైటిల్ కోసం.

చిత్రం విషయానికి వస్తే...తెలుగు, త‌మిళ్ లో 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి జీటీవీ వారు భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ 26 కోట్ల రూపాయలనే ప్రచారం జరుగుతోది. ఇందులో 21 కోట్లు తెలుగు, తమిళం శాటిలైట్ రైట్స్ కు కాగా ఐదు కోట్లు ఈ సినిమా హిందీ డబ్బింగ్ డబ్బింగ్ రైట్స్ కింద తీసుకున్నట్లు టాక్.

ఈ మధ్య తెలుగులో సినిమా మేకింగ్ వీడియోలను, టీజర్లను వర్చువల్ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. మహేష్-మురగదాస్ కాంబినేషన్ మూవీ టీజర్ కూడా ఈ వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీ లో విడుదల చేయడానికి వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

English summary
The delay in announcing Mahesh Babu-AR Murugadoss' up-and-coming slick actioner title is a blessing also for those who create Twitter jokes taking potshots at the makers. Since it has been rumored that the title is 'Agent Shiva'. While this sounds, on the face of it, to be the unlikeliest title, it has spawned a few jokes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu