twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్య దేవ్ కి ఆ ముద్ర తప్పదా.. ఆ రెండు సినిమాలు కూడా !

    |

    క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం అయిన సత్యదేవ్ చేసిన కొన్ని సినిమాలతో నటుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఏకంగా హీరోగా మారిన ఆయన తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్, జ్యోతిలక్ష్మి లాంటి సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారు. కానీ థియేటర్స్‌లో ఈయన సినిమాలు ఒక్కటీ ఆడలేదు. ముందు 47 డేస్ అంటూ ఎక్స్పెరిమెంటల్ మూవీ తో ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ తో వచ్చాడు సత్యదేవ్, ఆ సినిమా పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయింది. తర్వాత బాహుబలి నిర్మాతల నిర్మాణంలో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

    ఓటీటీలో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య దుమ్ము దులిపేసింది. చూసినవాళ్లంతా సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. ఆ తరువాత వచ్చిన గువ్వగోరింకతో సినిమా కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు సత్యదేవ్ చేస్తున్న మరో రెండు చిత్రాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరసు మరియు గాడ్సే సినిమాలు కూడా డిజిటల్ బాటలోనే ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో ఒప్పందాలను ఖరారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    Two of Satya Dev’s films going to OTT

    ఇప్పటికే తిమ్మరసు సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకి ఇప్పటికీ ఓటీటీ డీల్ కూడా కుదిరిందని అంటున్నారు. ఇక గాడ్సే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ఆ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తిమ్మరుసు సినిమా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కగా ప్రియాంక జువల్కర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాని మహేష్ కోనేరు నిర్మించారు. ఇక గాడ్సే సినిమాని బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపి గణేష్ దర్శకత్వం వహించగా సి కళ్యాణ్ నిర్మించారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ అయితే, సత్యదేవ్ కి డిజిటల్ హీరోగా పేరు రావడం ఖాయమే.

    English summary
    Satya Dev is a known face to digital audiences. His films UMUR, Guvva Gorinkatho, and 47 Days have released directly on OTT platforms.Reports suggest that Thimmarasu and Godse are on course to join the OTT bandwagon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X