»   » మధ్యలో ఆగిపోయిన ఉదయ్ కిరణ్ సినిమాల లిస్ట్

మధ్యలో ఆగిపోయిన ఉదయ్ కిరణ్ సినిమాల లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉదయ్ కిరణ్ నటించి మధ్యలో ఆగిపోయిన కొన్ని సినిమాల లిస్టు, క్యాన్సిల్ అయిన సినిమాల లిస్టు బయటకు వచ్చింది. అందుకు సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు మొదలవ్వడం, మధ్యలోనే ఆగిపోవడం, మొదలు కాకముందే ఆగపోవడం సర్వసాధారణమే.

Uday Kiran

1. ఎఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై 'ప్రేమంటే సులువుకాదురా' చిత్రం ప్రారంభించారు. 80 శాతం పూర్తయిన ఈచిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది.

2. ప్రత్యూష క్రియేషన్స్ వారు ఉదయ్ కిరణ్-అంకితతో మొదలు పెడదామనుకున్న సినిమా క్యాన్సిల్ అయింది.

3. అంజనా ప్రొడక్షన్స్ వారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్-అసిన్ జంటగా తీద్దామనుకున్న సినిమా రద్దయింది.

4. బాలకృష్ణ హీరోగా 'నర్తనశాల' సినిమా అనుకున్నారు. ఈచిత్రంలో ఉదయ్ కిరణ్ అభిమాన్యుడి పాత్రకు తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు.

5. ఉదయ్ కిరణ్-త్రిష జంటగా జబ్ వి మెట్ తెలుగు వెర్షన్ ప్లాన్ చేసారు కానీ వర్కౌట్ కాలేదు.

6. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు 'లవర్స్' అనే సినిమాను ఉదయ్ కిరణ్-సదా జంటగా ప్లాన్ చేసారు కానీ క్యాన్సిల్ అయింది.

7. ఆదిశంకరాచార్య సినిమా సినిమా నిర్మాత సమస్యల వల్ల రద్దయింది.

8. మనసంతా నువ్వే, నీ స్నేహం సినిమాల తర్వాత ఉదయ్ కిరణ్ తో ఎంఎస్ రాజు తీద్దామనుకున్న చిత్రం రద్దయింది.

9. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ను ఓ సినిమాకు అనుకున్నారు కానీ ఆ తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది.

English summary
Uday Kiran Cancelled Movies List. AM Ratnam's Surya movies 'premante suluvu kadura', which uday kiran is in dual role.almost 80% shooting is completed. Prathyusha creations starring uday kiran & ankitha is cancelled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu