»   » ‘సైరా’లో ఉపాసన కొత్త పాత్ర.. చిరంజీవి కోసం ధైర్యంగా..

‘సైరా’లో ఉపాసన కొత్త పాత్ర.. చిరంజీవి కోసం ధైర్యంగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, హిందీ భాషలతోపాటు పలు లాంగ్వేజ్‌లలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న సై రా నర్సింహారెడ్డి చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నది. ఈ చిత్రం కోసం మెగాస్టార్ అన్ని విధాలు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్‌లోనే షూటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌కు ముందు జరిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది. అదేమిటంటే కొణిదల వారి కోడలు ఉపాసన ఈ చిత్ర నిర్మాణ వ్యవహారాల్లో కీలక బాధ్యతను భుజాన వేసుకోనున్నట్టు తెలుస్తున్నది.

 నిర్మాణ బాధ్యతలు ఉపాసనకు

నిర్మాణ బాధ్యతలు ఉపాసనకు

సైరా చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. 'సైరా' చిత్రం సెప్టెంబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సింది. కానీ రాంచరణ్ రంగస్థలం షూటింగ్తో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం కూడా రాంచరణ్ బిజీగా ఉన్న నేపథ్యంలో భార్య ఉపాసనకు నిర్మాణ బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం.

 ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ..

ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ..

ఉపాసన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఆమెకు వ్యాపార నిర్వాహణ సామర్థ్యం ఉంది. అపోలో హాస్పిటల్, రాంచరణ్ ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ కి సంబంధించి వ్యవహారాలను ఉపాసన చూస్తున్నది. ప్రస్తుతం సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా తీసుకోనున్నట్టు సమాచారం.

అమితాబ్, విజయ్ సేతుపతి

అమితాబ్, విజయ్ సేతుపతి

సైరా చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్నది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయి సినిమాగా రూపొందించే ప్రయత్నంలో రాంచరణ్ ఉన్నాడు. ఈ చిత్రంలో పలు భాషలకు సంబంధించిన అగ్ర నటులు నటిస్తున్నారు. వారిలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఉన్నారు. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించే అవకాశం ఉపాసనకు రావడం నిజంగా అదృష్టమే.

ఉపాసన టాలెంట్‌కు టెస్ట్

ఉపాసన టాలెంట్‌కు టెస్ట్

మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే నాగబాబు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రాంచరణ్ నిర్మాతలుగా తమ సత్తాని చాటుకుంటున్నారు. ఇప్పుడు మెగా కోడలు ఉపాసన కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం గమనార్హం. సైరా నిర్మాణ బాధ్యతలను ఉపాసన ఎంతమేరకు సక్సెస్ ఫుల్ గా నిర్వర్తించగలదో వేచి చూడాల్సిందే.

English summary
Mega Power Star Ram Charan's wife Upasana is taking care off Apollo Hospital, True jet Airlines affairs. Now Upasan ready to take up Sye Raa Narasimha Reddy production affairs. Because Ram Charan is busy with Rangasthalam movie shooting. Sye Raa movie is producing under Konidala Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu