'బోల్డ్' వెనుక పడుతున్న యూవీ… మరో కధతో ప్రేక్షకుల ముందుకు ?
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడం మొదలుపెట్టారు. సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేకపోయినా భారీ ఫైటింగ్ లు, పాటలు లేకపోయినా సరే, సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం హిట్ చేస్తున్నారు. అందుకే పెద్ద ప్రొడక్షన్ సంస్థలు సైతం కుదిరితే తమ బ్యానర్ లోనే చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి. లేదా కొత్తగా తమ ప్రొడక్షన్ సంస్థకు బ్రాంచ్ లాంటి ఓపెన్ చేసి చిన్న సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే గీతా ఆర్ట్స్ సంస్థ అదే బాటలో పయనిస్తూ ఉండగా ఇప్పుడు కొత్తగా యు.వి.క్రియేషన్స్ సంస్థ కూడా అదే బాటలో పయనిస్తోంది.
ఇప్పటికే ఈ సంస్థ నుంచి యూవీ కాన్సెప్ట్స్ పేరిట రెండో బ్యానర్ ఏర్పాటు కాగా ఆ బ్యానర్ నుంచి సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కధ సినిమా ఈ మధ్యనే డిజిటల్ లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా బోల్డ్ సినిమాలని కూడా ఆదరిస్తారని ఈ సినిమా ద్వారా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని బోల్డ్ అటెంప్ట్ సినిమాలతో ముందుకు రావాలని ఇతర తెలుగు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. యు.వి. క్రియేషన్స్ వాళ్లు సైతం ఇలాంటిదే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారని అంటున్నారు.

అలాగే ఈ ఏక్ మినీ కధ సినిమాకి కథ అందించిన మేర్లపాక గాంధీ మరో సినిమాకి కూడా కథ అందించబోతున్నారు. మరో కొత్త దర్శకుడిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఏక్ మినీ కథ సినిమాలాగానే తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేసి దానిని సైతం ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మేర్లపాక గాంధీ చెప్పిన లైన్ బాగా నచ్చిందని ప్రస్తుతం దానిని స్క్రిప్ట్ గా తీర్చి దిద్దే పనిలో ఉన్నారని అంటున్నారు. అది పూర్తయ్యాక కరోనా పరిస్థితి కాస్త కుదుట పడ్డాక సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











