»   » 'అల్లుడుశీను' కథ ఇదే?

'అల్లుడుశీను' కథ ఇదే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన చిత్రం 'అల్లుడుశీను' . వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. చిత్రం కథేమిటంటే...మొదటినుంచీ చెప్పుకుంటున్నట్లుగానే ప్రకాష్ రాజ్ కవలలుగా ద్విపాత్రాభినయం చేసారు. ఒకరు సామాన్య వ్యక్తి నరసింహంగా మరొకరు భాయ్ గా కనిపిస్తారు. ఆస్తి గొడవలు నిమిత్తం తన సొంత సోదరుడునే చంపాలని చూస్తాడు క్రిమినల్ ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో నరసింహం అక్కడనుంచి తప్పించుకుని పారిపోతాడు. అయితే నరిసింహం కూతురు పేర ఆస్ది ఉండటంతో...భాయ్ చిన్నప్పుడే ఆమెనుఎత్తుకెళ్లిపోతాడు. ఆమెను తన సొంత కూతురులా పెంచుకుంటూంటారు.

మరో ప్రక్క నరిసింహం(ఇంకో ప్రకాష్ రాజ్)... అనాధ అయిన అల్లుడు శ్రీను(బెల్లంకొండ శ్రీనివాస్) ని చేరదీసి పెంచుతూంటాడు. అల్లుడు శ్రీను, నరసింహం ...ఇద్దరూ నల్గొండ జిల్లాలో ఓ పల్లెలో ఉండగా..అక్కడ అప్పులు పాలై...అనుకోని పరిస్ధితుల్లో హైదరాబాద్ వచ్చి పడతారు. అక్కడ భాయ్ ని చూసిన అల్లుడు శ్రీను మొదటి ఈ ఒకే పోలికలుతో ఉండటాన్ని ఎడ్వాంటేజ్ గా తీసుకుని వాడుకోవాలని చూస్తాడు.

V.Vinayak's Alludu Seenu Story Line

తర్వాత ఈ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటాడు. దాంతో తన మామ నరసింహానికి జరిగిన అన్యాయం తెలుసుకుని, భాయ్ నుంచి మామ కూతురుని తీసుకురావాలని చూస్తాడు. ఆమే అంజలి(సమంత). ఆమెకు భాయ్ వేరే వారితో సంభంధం ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే ఆమె పేరునే ఆస్తి ఉందని , ఆమెతో అతనికి అవసరం ఉంటుంది. ఈ నేపధ్యంలో అల్లుడు శ్రీను ఎలా ...భాయ్ కు బుద్ది చెప్పి, తన మామ కూతురు ని పొందాడనేది మిగతా కథ.

English summary
Bellamkonda Suresh's son Bellamkonda Srinivas debut film ‘Alludu Seenu’ in the direction of V.V.Vinayak is getting ready to hit the big screens on today (July 25th).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu