For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Agent విషయంలో అఖిల్ ఆశలన్నీ అతడి మీదే: డైరెక్టర్ కంటే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడట

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే, అందులో అందరూ సక్సెస్ కాలేదు. కొందరు మాత్రమే స్టార్లుగా వెలుగొందుతుండగా.. మరికొందరు మాత్రం సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ ఒకడు. చిన్న వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాతో అలరించిన ఈ కుర్రాడు.. సుదీర్ఘ విరామం తర్వాత 'అఖిల్' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూసిన సంగతి విధితమే.

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్

  మొదటి చిత్రం అంతగా ఆకట్టుకోకపోవడంతో అక్కినేని అఖిల్‌ను 'హలో' మూవీతో రీలాంఛ్ చేశాడు నాగార్జున. అయితే, ఇది కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య 'మిస్టర్ మజ్నూ' అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడతను. కానీ, ఈ చిత్రం కూడా అతడికి సక్సెస్‌ను అందించలేదు. దీంతో అతడి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాపులు వచ్చి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని వారసుడు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాను చేశాడు. ఇది ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా.. అనివార్య కారణాలతో విడుదల మాత్రం కాలేదు.

  Vakkantham Vamsi Full Focus on Akhil Akkineni Agent Movie

  ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న అక్కినేని అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేసిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటించింది. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇది విడుదల కాకముందే అఖిల్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన కొత్త సినిమాను పట్టాలెక్కించేశాడు. 'ఏజెంట్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  'ఏజెంట్' మూవీపై అఖిల్‌తో పాటు అక్కినేని అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సురేందర్ రెడ్డి. అయితే, అతడి కంటే ఎక్కువగా ఈ చిత్రంపై ఫోకస్ పెట్టాడట స్టోరీ రైటర్ వక్కంతం వంశీ. గతంలో ఎన్నో చిత్రాలకు కథను అందించిన అతడు.. అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇది ఫ్లాప్ అవడంతో అతడు సినిమాలు తగ్గించాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత వంశీ.. 'ఏజెంట్' మూవీకి స్టోరీ అందించాడు. అంతటితో ఆగకుండా దీని కోసం ఎంతో కష్టపడుతున్నాడట. దీంతో విజయాన్ని అందుకుని పునర్వైభవం అందుకోవాలన్న పట్టుదలతో అతడు సురేందర్ రెడ్డితో కలిసి పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

  భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఏజెంట్' మూవీలో అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న 'ఏజెంట్' యాక్షన్ మూవీలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్నట్లు ఆరంభంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనను కాదని అదే పరిశ్రమకు చెందిన మమ్ముట్టిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

  English summary
  Tollywood Young Hero Akhil Akkineni Now Doing AGENT Movie Under Surender Reddy Direction. Vakkantham Vamsi Full Focus on this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X