Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
విజయ్ సినిమా కోసం మరో స్టార్ హీరోయిన్ పై ఫోకస్ పెట్టిన వంశీ పైడిపల్లి.. భారీగా రెమ్యునరేషన్?
గతంలో కొంతమంది స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ వైపు వెళ్లారు అంటే మళ్లీ సౌత్ సినిమాలపై అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కోలీవుడ్ టాలీవుడ్ నుంచి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునే వారు కూడా కాదు. ఒక్కసారి బాలీవుడ్ వెళితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అని ఆలోచించేవారు. అయితే మారుతున్న కాలానికి తగ్గట్లుగానే సినీతారల ఆలోచనా విధానాలు కూడా మారుతున్నాయి. ఎందుకంటే ప్రేక్షకులు కూడా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలను బాధతో సంబంధం లేకుండా నిలబడి చూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఆదరణ ఏ స్థాయిలో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సౌత్ ఇండస్ట్రీలో అయితే ద్విభాషా చిత్రాలకు కూడా మార్కెట్ స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు మంచి మార్కెట్ అయితే సెట్ చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే దళపతి విజయ్ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల కాబోతున్నట్లు మాస్టర్ సినిమాతోనే క్లారిటీ వచ్చేసింది. విజయ్ తన కెరీర్లో ఎప్పుడూ కూడా టాలీవుడ్ మార్కెట్ పై అంతగా ఫోకస్ పెట్టలేదు. కానీ మాస్టర్ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు అని అతనికి అర్థమైపోయింది. అందుకే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాకుండా సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు తో చేతులు కలపడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం విజయ్ 90 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి.

వంశీ పైడిపల్లి మొదట మహేష్ బాబుతో చేయాలనుకున్న కథను విజయ్ కోసం కాస్త మార్చినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కాస్త ఎక్కువ సమయం పట్టిందనే చెప్పాలి. హీరో విజయ్ నాలుగైదుసార్లు దర్శకుడితో మాట్లాడిన తర్వాతనే సినిమా చేసేందుకు ఆసక్తిని చూపించాడు. ఇక ఫైనల్ గా ఈ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి స్టార్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో పెద్ద సినిమాల్లో అవకాశం అందుకుంటున్నటువంటి కియార అద్వానీ నీ సెలెక్ట్ చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అలాగే బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక RC 15 సినిమా అనంతరం మరి కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి కూడా ఎక్కువగా కియార పైనే ఫోకస్ పెట్టినట్లుగా టాక్ అయితే వస్తుంది. అయితే వినయ విధేయ రామ సినిమా అనంతరం పూర్తి స్థాయిలో కమర్షియల్ సినిమాలు చేయకూడదని డిసైడ్ అయింది. మరి వంశీ పైడిపల్లి కథ ఆమెను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ బ్యూటీ ఇప్పటికే రామ్ చరణ్ సినిమా కోసం 4.5కోట్లు ఛార్జ్ చేస్తోంది. ఇక విజయ్ సినిమా కోసం ఇంకా ఏ స్థాయిలో డిమాండ్ చేస్తుందో అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్ విషయంపై త్వరలోనే దర్శకుడి ద్వారా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. ఇక విజయ్ బీస్ట్ అనంతరం వంశీ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నాడు.