VIjayతో వంశీ పైడిపల్లి సినిమా.. అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్.. ఆరోజే!
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తర్వాత సినిమా కూడా మహేష్ బాబుతో చేయాల్సి ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ సినిమా ప్రకటించిన తరువాత కూడా మహేష్ బాబు వంశీ పైడిపల్లితో చేయకుండా అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు మొదలుపెట్టారు. అప్పటి నుంచి వంశీ పైడిపల్లి సినిమా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
చాలా మంది స్టార్ హీరోలకి ఆయన కథలు వినిపించినా ఎవరూ ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ కి కథ చెప్పగా ఆ కథను విజయ్ ఫైనల్ చేశారు. వంశీ పైడిపల్లి గత సినిమాల నేపథ్యంలో ఆయనకు సినిమా అవకాశం విజయ్ ఇచ్చాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం విజయ్ 65వ సినిమా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతోంది. విజయ్ 66వ సినిమా ను లలిత్ కుమార్ నిర్మించబోతున్నాడు.

ఆ సినిమా దర్శకుడు ఎవరు అనే విషయం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానికి లోకేష్ కనగారాజ్ ఆ సినిమా దర్శకత్వం వహిస్తున్నారని అంటున్నారు. ఇక ఆ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 67వ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ కావడం తెలుగు మంచి పేరున్న దర్శకుడు కావడంతో రెండు బాషలలో సినిమాకి మంచి మార్కెట్ అవుతుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా ప్రకటన విజయ్ పుట్టిన రోజున అంటే 22 జూన్ నాడు ఈ ప్రకటన చేయవచ్చని అంటున్నారు. అలా అయినా 2019లో మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వంశీ మళ్ళీ రెండేళ్ళకి కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











