హను-మాన్ కోసం స్టార్ నటి… ఆ కీలక పాత్ర కోసం ఫైనల్!

విలక్షణ సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. చేసిన మొదటి సినిమాతో ఆయన విలక్షణ దర్శకుడు అనిపించుకున్నారు. సరికొత్త పాయింట్లతో సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఆయన అనేక ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ వర్మ ఈ మధ్యనే తన నాలుగో సినిమాను కూడా అధికారికంగా అనౌన్స్ చేశాడు. మొన్నీ మధ్యనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. హనుమంతుడి కథతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ విషయాన్ని తన పుట్టిన రోజు నాడు ప్రకటించిన ప్రశాంత్.. 'ఈ సారి నాకు ఇష్టమైన జోనర్‌తో వస్తున్నాను. క్రొత్త సినిమాటిక్ విశ్వంలోకి ప్రవేశించడానికి మీ సీట్ బెల్టులను కట్టుకోండి. హనుమాన్.. తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా' అంటూ అందులో పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ 'హను మాన్' లో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారని అంటున్నారు. ఆమె పాత్ర గురించి వివరాలు పూర్తిగా బయటకు అయితే రాలేదు.

Varalakshmi sarath kumar roped in for Prashant Varma’s Hanu-Man

అయితే ఆమె చేయబోయేది కీలక పాత్ర అని మాత్రం తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కువగా ఆమె పేరే వినిపిస్తోంది. చేసింది కొన్ని సినిమాలే అయినా అద్భుతమైన నటన నైపుణ్యంతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరికీ ఆకట్టుకుంది. అందుకే ఆమెకు ఈ పాత్ర దక్కిందని అంటున్నారు. ఇక క్రాక్ లో ఆమె చేసిన జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనకు ఆమె అనేక ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమె అనేక తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చివరి సినిమా 'జాంబీ రెడ్డి' సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X