»   » గిల్టీగా ఫీలైన వరుణ్ తేజ్, తండ్రి కోసం ఖరీదైన కారు!

గిల్టీగా ఫీలైన వరుణ్ తేజ్, తండ్రి కోసం ఖరీదైన కారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా నిర్మాత నాగ బాబు.... ఇదంతా నిన్నటి మాటే. ఇపుడు నటుడు నాగ బాబు మాత్రమే. ఒకప్పుడు నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన ఆయన ప్రస్తుతం సినిమాలు నిర్మించే స్థాయిలో లేరనేది జగమెరిగిన సత్యం. ఆరెంజ్ సినిమా భారీ ప్లాప్ తర్వాత కోలుకోలేని దెబ్బతిన్న నాగబాబు సినిమా నిర్మాణానికి దూరం అయ్యారు. అయితే ఎప్పుడూ పరిస్థితి ఇలానే ఉండదు. తిరిగి పూర్వవైభవం కోసం తన ప్రయత్నం తాను చేస్తున్నారు.

ఇపుడు నాగబాబుకు అన్ని విధాలుగా సపోర్టు ఇచ్చేందుకు చెట్టంత కొడుకు వరణ్ తేజ్ ఉన్నాడు. వరుణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు... సక్సెస్ ఫుల్ స్టార్‌గా దూసుకెలుతున్నాడు. తండ్రి కోసం ఖరీదైన కారును కూడా కొన్నట్లు టాక్. అది మామూలూ ఆశామాషీ కారు కాదు... కోటికి పైగా విలువ చేసే లగ్జరీ రోల్స్ రాయిస్ కారు అని టాక్.

Varun Tej gifted Rolls Royce car to Naga Babu

ఇలాంటి కారు ఇప్పటి వరకు చిరంజీవి వద్ద మాత్రమే ఉంది. ఇపుడు ఇలాంటి కారే తన తండ్రికి ఉండాలని ఆశ పడుతున్నాడు వరుణ్ తేజ్. ఉన్నట్టుండి వరుణ్ తేజ్‌కు ఇలాంటి ఖరీదైన ఆలోచన రావడానికి కారణం కూడా ఉందట. ఇటీవల 'మిస్టర్' మూవీ ప్రారంభానికి నాగబాబు అండ్ ఫ్యామిలీ ఓ 13 లక్షల విలువైన సెడాన్ లో వస్తే.. డైరెక్టర్ శ్రీనువైట్ల కోటిన్నర ఖరీదైన కార్లో వచ్చారు.

ఇది చూసిన వరుణ్ తేజ్ కాస్త గిల్టీగా ఫీలయ్యారని, అందుకే తమ ఫ్యామిలీకంటూ ఓ ఖరీదైన కారు ఉండాలని.... తండ్రి ప్రెస్టీజ్ కాపాడాలనే ఉద్దేశ్యంతో కోటికిపైగా విలువ చేసే రోల్స్ రాయిస్ కారు బుక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా తాను కమిటైన సినిమాలకు వచ్చిన రెమ్యూనరేషన్‌తో ఈ కారు బుక్ చేసినట్లు సమాచారం.

English summary
Varun Tej is doing back to back movies and he is already touching the top league. If one or two of his forthcoming ventures become a success then there is no doubt that Varun will get the capacity to buy a Rolls Royce and gift it to his father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu