»   » ఒకే రీమేక్ పై మెగా హీరోలిద్దరి కన్ను

ఒకే రీమేక్ పై మెగా హీరోలిద్దరి కన్ను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు హాట్ టాపిక్ అంతా రామ్ చరణ్ కి పోటీగా వరున్ తేజ్ ఇస్తున్న పోటీ గురించే . గతంలో చిరంజీవి సుపర్ హిట్ సినిమా చాలెంజ్ మీదే వీరిద్దరి కళ్లూ పడ్డాయి. ఇప్పుడు ఎవరికి వాళ్లే ఈ సినిమాని రీమేక్ చేయాలనకుంటున్నట్లు సమచారాం. మరి ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి మరి..కాకపోతే ఇద్దరు మెగా ఫ్యామిలికి చెందిన వాళ్లే కావడంతో టాపిక్ గ మారింది.

రామ్ చరణ్ ఇప్పుడు తని ఒరువన్ రీమేక్ పనుల్లో బిజీగ ఉంటే...వరుణ్ తేజ తన తాజా చిత్రం లోఫర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌.

Varun Tej is interest to remake Chiranjeevi's challenge

వరుణ్ తేజ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. సునీల్‌ కశ్యప్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే..

ఈసినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని దీమాగా ఉన్నాడు వరున్. పూరితో ఈ సినిమా కొత్త ఉత్సహం అందిచిందని ఆనందంలో గడుపుతున్నాడు.

English summary
Varun teja likes to remake Challenge if he gets a chance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu