»   » 'ఆరడుగుల బుల్లెట్టు' టైటిల్ ఆ మెగా హీరోకే ఫైనల్

'ఆరడుగుల బుల్లెట్టు' టైటిల్ ఆ మెగా హీరోకే ఫైనల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : టైటిల్ అనేది సినిమాకు ఓ క్రేజ్ తెచ్చే ఎలిమెంట్. పెద్ద హీరోల సినిమాలకు హీరోని టార్గెట్ చేస్తూ టైటిల్స్ పెడతారు. అలాగే చిన్న హీరోల సినిమాలకు ఆ సినిమా కాన్సెప్ట్ ని బట్టి టైటిల్స్ పెట్టి ఆసక్తి క్రియేట్ చేస్తూంటారు. అంతేగాక జెనర్ ని బట్టి కూడా టైటిల్స్ మారిపోతూంటాయి. టైటిల్స్, ప్రోమోలతోనే క్రేజ్ క్రియేట్ అయ్యి, హీరోలతో సంభంధం లేకుండా ..థియోటర్స్ కు ఓపినింగ్స్ కూడా చాలా సార్లు వస్తూంటాయి. అందులోనూ ఈ మధ్య కాలంలో టైటిల్స్ కీలక అంశంగా మారాయి.

పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని పాటలోని 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ తో ఏ హీరో సినిమా చేస్తాడనేది అందరిలో చాలా సస్పెన్స్ గా ఉంది. అయితే ఈ టైటిల్ తో త్వరలో లాంచ్ అవుతున్న మరో మెగా హీరో వరుణ్ తేజ చిత్రం చేస్తారని సమాచారం. ఈ టైటిల్ పెట్టడంతో పవన్ బ్రాండ్ కూడా యాడ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేయనున్నట్లు చెప్తున్నారు.

ఇక 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ అధినేత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్‌గా ఫిల్మ్‌చాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. మరి వరుణ్ తేజ్ ని అశ్వనీదత్ లాంచ్ చేయనున్నారు. దాంతో 'ఆరడుగుల బుల్లెట్' టైటిల్ ని అశ్వనీదత్ కి తీసుకుంటున్నట్లు చెప్తున్నారు..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవ్వడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కూడా ఇతర మెగా హీరోల్లానే సక్సెస్ అవుతాడనే పూర్తి నమ్మకంతో ఉన్నారు అభిమానులు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు అతన్ని సక్సెస్ ఫుల్‌గా లాంచ్ చేసే నిర్మాత, దర్శకుడి కోసం మల్లగుల్లాలు పడ్డ మెగా ఫ్యామిలీ చివరకు పూరి జగన్నాథ్‌ను దర్శకుడిగా, అశ్వినీదత్‌ను నిర్మాతగా ఎంపిక చేసారు.

ఫలితంగా 'చిరుత' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయ్యాడు రామ్ చరణ్. తాజాగా వరుణ్ తేజకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. నిర్మాత అశ్వినీదత్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ అయితే అతను సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడనే సెంటిమెంటు ఇండస్ట్రీలో బలంగా పాతుకు పోయింది. గతంలో ఆయన ద్వారా వెండి తెరకు పరిచయమైన మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లే ఇందుకు నిదర్శనం.

English summary
After going through a series of irectors the last report heard was Varun will be teaming up with Sreekanth Addala for his debut flick. Now, it is heard that the title is also being finalized.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu