»   » వరుణ్ తేజ ‘గొల్లభామ’ హీరోయిన్ ఈమే

వరుణ్ తేజ ‘గొల్లభామ’ హీరోయిన్ ఈమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ పరిచయ చిత్రం 'గొల్లభామ' కి హీరోయిన్ సెట్ అయినట్లు సమాచారం. ఆమె పేరు అక్షర గౌడ. బెంగళూరు నుంచి వచ్చిన ఆమె ఇప్పటికే తమిళ,హిందీ చిత్రాలలో నటించింది. రీసెంట్ గా అజిత్ ఆరంభం చిత్రంలో కీలకమైన పాత్రను పోషించింది. ఈ చిత్రంలో తెలుగులో ఆమె లాంచ్ అవుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కలిపి నిర్మించనున్నారు.

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు రెండింటిలోనూ గోదావరి జిల్లా అందాలు, అక్కడ బాష కనిపిస్తుంది. ఇప్పుడు తన మూడో చిత్రానికి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ నే ఎన్నుకున్నట్లు సమాచారం. గొల్లభామ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం గోదావరి దగ్గర ఓ పల్లెలో జరిగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

Varuntej's Gollabhama heroine confirmed

అలాగే ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

English summary
Naga Babu's son Varuntej's debut film ‘Golla Bhama’ is all set to hit the floors soon. The film makers have roped Akshara Goud as female lead role who hails from Bangalore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu