»   » కుర్రాడికి హిట్ ని క్యాష్ చేసుకోవటం రాలేదు

కుర్రాడికి హిట్ ని క్యాష్ చేసుకోవటం రాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా హిట్ అవగానే ఆ దర్శకుడు, హీరో ,హీరోయిన్స్ కు డిమాండ్ వచ్చేస్తుంది. అయితే ఇండస్ట్రీలో మరో హిట్ వచ్చి ఈ టీమ్ ను మర్చిపోయేలోగా వీళ్లు వేరొక సినిమా పట్టేయాలి. అది కొద్దిమందికే సాధ్యం. ఆ టెక్నిక్ వెంకటాద్రి ఎక్సప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ కి తెలియలేదంటున్నారు. వెంకటాద్రి ఎక్సప్రెస్ తో హిట్ కొట్టిన గాంధీ తన తదుపరి చిత్రం టాలీవుడ్ లో ని పెద్ద హీరోతో చేస్తారనుకున్నారు. అయితే అతను సుశాంత్ తో చేస్తున్నాడు.

 Venkatadri Express director with Sushanth

కెరీర్ లో ఒక్క హిట్టూ లేక తనకు తోచినట్లు సినిమాలు చేస్తూ జనాల మీదకు వదులుతున్న సుశాంత్ తో మేర్లపాక మురళి జత కట్టారు. ఈ నెలలో ఈ చిత్రం ప్రారంభం కాుంది. ఇప్పటికే స్క్రిప్టు ఫైనల్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అప్పటికీ మేర్లపాక గాంధీ...రామ్, నితిన్ వంటి యంగ్ హీరోల వద్దకు తిరిగాడు కానీ ఫలితం లేకుండా పోయిందని చెప్తున్నారు. అతను హీరోయిజం లేపే కథతో రాలేదని రిజెక్టు అయ్యిందని ఫిల్మ్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే సుశాంత్ తల్లి నాగ సుశీల మరియు చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. ఇంతకుముందు సుశాంత్,నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో చిత్రం ఓకే అయ్యింది కానీ ముందుకు వెళ్లలేదు. నాగేశ్వరరెడ్డి...మంచు మనోజ్ చిత్రం చేస్తున్నారు. దాంతో దర్శకుడు కోసం వెయిట్ చేస్తున్న సుశాంత్ వద్దకు మేర్లపాక గాంధీ వెళ్లటం వెంటనే ప్రాజెక్టు ఫైనల్ అవ్వటం జరిగిందని తెలుస్తోంది.

English summary
Venkatadri Express director Merlapaka Gandhi will be directing Sushanth's next.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu