For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నమ్ముతారా? : పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బడ్జెట్ 12 కోట్లు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాధారణంగా పవన్ కళ్యాణ్ చిత్రాల బడ్జెట్ నలభై నుంచి యాభై కోట్ల వరకు ఉంటున్నాయి. దానికి తగ్గట్లే కలెక్షన్స్ కూడా అరవై కోట్లు నుంచి వంద కోట్లు వరకూ జరుగుతోంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే యాభై దాటుతుంది అని లెక్కలు చెప్తున్నారు. అందులో వెంకటేష్ కూడా నటిస్తున్నాడు అంటే మరీ పెరిగిపోతుంది. అయితె వెంకటేష్, సురేష్ బాబు కలిసి బడ్జెట్ ని కంట్రోలలో పెట్టాలనే ఆలోచనతో తమ తాజా చిత్రం గోపాల గోపాల బడ్జెట్ ని 12 కోట్లకు(పవన్,వెంకీ బడ్జెట్టులు కాకుండా) కుదించారని చెప్పుకుంటున్నారు.

  ఈ విషయమై పవన్ ని స్వయంగా వెంకటేష్ ముందు కలిసి, బడ్జెట్ కంట్రోలు విషయం వివరించాడని తెలుస్తోంది. చిన్న బడ్జెట్ చిత్రం రీమేక్ కావటంతో అంతా తమ కంట్రోలులో ఉంటుందని భావిస్తున్నారు. పవన్ లాంటి పవర్ స్టార్ తమ సినిమాలో ఉంటే ఓపినింగ్స్ తోనే బడ్జెట్ ని ఒకటి రెండు రోజుల్లో లాగేయవచ్చనేది ఆలోచన అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి రెమ్యునేషన్ ఓ ప్రాంతం రైట్స్ ఇస్తున్నారని అందుకే అంత కంట్రోలుగా చేయగలుగుతున్నారని అంటున్నారు. వెంకటేష్ తాజా చిత్రం దృశ్యం సైతం 7 కోట్లు లోపే తెరకెక్కడంతో, ఓపినింగ్స్ డల్ గా ఉన్నా రిస్క్ లేకుండా సేఫ్ గా ఉంది. అదే స్ట్రాటజీని సురేష్ బాబు ఈ గోపాల గోపాల చిత్రానికి కూడా అమలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

  'ఓ మై గాడ్‌'కిది రీమేక్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకటేష్‌, శ్రియ ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ త్వరలో బృందంతో కలుస్తారు. సినిమా కోసం ఆయన 20 రోజులపాటు కాల్షీట్లు కేటాయించారని సమాచారం. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు నటిస్తున్నారు.

  venkatesh convinced pawan on gopala gopala budget

  పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.

  కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

  'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

  భూకంపం వచ్చి ఓ వ్యక్తికి చెందిన దుకాణం కూలిపోతుంది. దీంతో నష్టపరిహారం చెల్లించాలంటూ దేవునిపై కేసు పెడతాడాయన. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రధారులు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థాసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. హిందీలో వచ్చిన 'ఓ మై గాడ్‌'కిది రీమేక్‌. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మకడలి

  English summary
  
 
 Suresh Babu and Venky could convince Pawan Kalyan on 'Gopala Gopala' budget.The satirical drama directed by Dolly is made on just Rs 12 crore, excluding Pawan Kalyan and Venkatesh remunerations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X