»   » రాజకీయ కారణాల వల్లే...వెంకటేష్ మార్చారు

రాజకీయ కారణాల వల్లే...వెంకటేష్ మార్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుమారు సంవత్సరం క్రితం వెంకటేష్ ఓ కథను ఓకే చేసారు. అయితే ఇన్నాళ్ళకా ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు...మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రానికి రాధా అనే టైటిల్ పెడదామనుకున్నారు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో ...విజయవాడకు చెందిన ఓ పొలిటీషియన్ కథ గా భ్రమపడే అవకాసం ఉందని , అనవసరమైన కాంట్రవర్శలకు దారి తీస్తుంది కాబట్టి అలాంటి వద్దనుకున్నట్లు సమాచారం. దాంతో రాధా, రాధ కిృష్ణా టైటిల్స్ అనుకున్నా చివరకు 'బాబు బంగారం' ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మొదట నుండి వెంకిని ఇండస్ట్రీలో అందరూ బాబు అని పిలుస్తుండటం కూడా ఈ చిత్రానికి ఈ పేరు బాగుంటుందని ఫైనల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. వెంకటేష్ సైతం ఈ టైటిల్ బాగుంటుందనే బావన వ్యక్తం చేసినట్లు సమచారం.

venkatesh finalised 'Babu Bangaram' for his upcoming movie

చిత్రం విశేషాలకు వస్తే... వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం డిసెంబర్‌ 16న ప్రారంభం కానుందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ విషయాన్ని నాగవంశీ తెలియజేస్తూ ‘‘ఇదివరకు ‘లక్ష్మీ', ‘తులసి' చిత్రాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వెంకటేశ్, నయనతార మరోసారి మా చిత్రంలో జంటగా నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇటీవల మారుతి చెప్పిన కథ మాకు, వెంకటేష్ గారికి బాగా నచ్చింది. వారి కాంబినేషన్ సినిమా అనగానే షూటింగ్‌ ప్రారంభానికి ముందుగానే క్రేజ్‌ వచ్చింది.

ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవుతుంది. తెలుగులో ‘రన్ రాజా రన్', ‘జిల్‌' సినిమాలకు పనిచేసిన జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్‌.వివేక్‌ ఆనంద్‌, కూర్పు: ఉద్దవ్‌, సమర్పణ: ఎస్‌.రాధాకృష్ణ

ఈ చిత్రానికి బాబు బంగారం అనే టైటిల్‌ ఫైనల్ చేయాల్సి ఉన్నా ఆ చిత్రాన్ని 2016 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అని చెప్పారు.

English summary
To avoid political controversy, the title for Venkatesh and director Maruthi’s film has been changed from Radha to Babu Bangaram.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu