»   » వెంకీ రెమ్యునేషన్ ... ఐడియా సూపర్

వెంకీ రెమ్యునేషన్ ... ఐడియా సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తన తోటి హీరోల కన్నా భిన్నమైన పాత్రలు,కథలు ఎంపిక చేసుకోవటమే కాకుండా తన రెమ్యునేషన్ విషయంలోనూ వెంకటేష్ కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన తన తాజా చిత్రం దృశ్యం కు రెమ్యునేషన్ క్రింద శాటిలైట్ రైట్స్ రాయించుకున్నారట. ఇప్పుడు అదే కలిసివచ్చిందంటున్నారు. సినిమా మీద నమ్మకంతో శాటిలైట్ రైట్స్ నే రెమ్యునేషన్ గా ఒప్పుకోవటంతో ఇప్పుడు ఆయన దాని నిమిత్తం మంచి మొత్తమే పొందాడంటున్నారు.

దృశ్యం శాటిలైట్ రైట్స్ ని జెమెనీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ శాటైలైట్ రైట్స్ ని దాదాపు పదకొండున్నర కోట్లు కు తీసుకున్నట్లు సమాచారం. సినిమా ఫ్యామిలీలను టార్గెట్ చేసింది కావటంతో ఖచ్చితంగా టీవి లలో రిపీట్ ఆడియన్స్ ని సొంతం చేసుకుంటుందని, టీఆర్పిలు బాగుంటాయని భావించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Venkatesh followed new policy for Drushyam

వెంకటేష్ రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునేషన్ కన్నా ఇది ఎక్కువే అంటున్నారు. మరో ప్రక్క ఇలా రెమ్యునేషన్ రిలీజ్ తర్వాత తీసుకోవటం వల్ల బడ్జెట్ పరంగా నిర్మాతపై ఒత్తిడిపడకపోవటంతో హ్యాపీగా ఉన్నారు. చిన్న సినిమా చేసాం...అనుకున్న బడ్జెట్ లో చేసాం...లాభాలు పంచుకుందాం అనే స్కీమ్ లో దీన్ని వర్కవుట్ చేసారంటున్నారు. ఇక పై కూడా వెంకటేష్ ఇదే ధోరణిలో తను ఒప్పుకునే చిత్రాలకు పనిచేస్తాడని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే వెంకటేష్...తెర మీదే కాదు తెరవెనుకా నిర్మాతల పరంగా రియల్ హీరోనే.

మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ ఇది. డా.డి.రామానాయుడు సమర్పించారు. వెంకటేష్ తొలిసారి ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా నటించారు. మీనా కీలక పాత్రధారి. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అరకు, విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేసారు.

నరేష్, నదియ, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: డా.డి.రామానాయుడు, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కథ: జీతూ జోసెఫ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి, ఆర్ట్: వివేక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సురేష్ బాలాజి, జార్జ్ పైయస్.

English summary
Venkatesh did not take any remuneration as such for Drushyam but signed an agreement that whatever the filmmakers get for satellite rights, they should give the same to him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu