‘అజ్ఞాతవాసి’ నుండి వెంకీని లేపేశారా? ఇంతకీ అసలున్నాడా?
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 'గోపాల గోపాల' తర్వాత ఈ ఇద్దరినీ మరోసారి తెరపై చూడబోతున్నామని అభిమానులు సంబరపడ్డారు. అయితే బుధవారం 'అజ్ఞాతవాసి' చూసిన చాలా మంది అభిమానులు ఈ విషయంలో నిరాశ చెందారు.

ఎక్కడా కనిపించని వెంకటేష్
‘అజ్ఞాతవాసి' చిత్రంలోని ఏ సీన్లోనూ విక్టరీ వెంకటేష్ కనిపించలేదు. దీంతో ఇన్నాళ్లు వెంకీ ఈ సినిమాలో ఉంటాడని భావించిన అభిమానులు అతడు కనిపించక పోవడాన్ని చూసి కాస్త హర్టయ్యారు.

ఏనాడూ ప్రకటించలేదు
వాస్తవానికి ‘అజ్ఞాతవాసి' చిత్రంలో వెంకీ ఉన్నట్లు చిత్ర బృందం కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. అదే సమయంలో వెంకీ ఉన్నాడనే వార్తలను కూడా ఖండించలేదు. దీంతో ఈ విషయంలో చాలా కాలంగా అయోమయంలోనే ఉన్నారు.

ఇంతకీ వెంకీ ఉన్నాడా? తర్వాత కలుపుతారా?
ఇదిలా ఉంటే.... వెంకటేష్ చేసిన సీన్స్ ను త్వరలో యాడ్ చేస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇప్పటికైనా ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సిన అసరం ఉంది.

అజ్ఞాతవాసి
‘అజ్ఞాతవాసి' సినిమా బుధవారం గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











