»   » వెంకీ, మారుతి 'రాధ' చిత్రం కథ వివాదం?

వెంకీ, మారుతి 'రాధ' చిత్రం కథ వివాదం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో కాపీ వివాదలు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కథల విషయంలో పెద్ద దర్శకులు, సంస్ధల విషయంలోనూ పెద్ద పెద్ద వివాదాలే చెలరేగాయి. అయితే అవి బయిటకు పెద్దగా వచ్చేవి కాదు. గతంలోలా పరిస్ధితులు ఇప్పుడు ఉండటం లేదు. మీడియా పెరిగిపోవటంతో ప్రతీ విషయం నలుగురులో చర్చగా మారి మీడియాలోకి వచ్చేస్తోంది. తాజాగా వెంకటేష్ చేద్దామనుకుంటున్న 'రాధ' చిత్రం కథ విషయమై కాపీ వివాదం చెలరేగిందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ మేరకు మీడియా వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ గుసగుసలు వినపడుతున్నాయి.

వారు చెప్పుకునేదాని ప్రకారం...ఓ పెద్ద దర్శకుడు వద్ద పనిచేసిన అశోశియేట్ డైరక్టర్ తాను దర్శకుడుగా మారటం కోసం... రీసెంట్ గా వెంకటేష్ కు కథ చెప్పటం జరిగింది. అయితే కొద్ది రోజులు స్టోరీ డిస్కషన్స్ జరిగాక, ఆ కథ వెంకటేష్ రిజెక్ట్ చెయ్యటం జరిగింది. అయితే ఇప్పుడు అదే స్టోరీ లైన్ తో 'రాధ' చిత్రం తెరకెక్కుతోందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై ఆ కథ రచయిత,ఆ దర్శకుడు వెంకటేష్ ని అడిగారని, సరైన స్పందన కొరవడటంతో సిని ఇండస్ట్రీ గురువుగారు గా భావించే దాసరి వద్దకు వెళ్లారని సమాచారం. ఆయన ఈ విషయం సెటిల్ చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అంతేగాక రైటర్స్ అశోశియేషన్ లోనూ కంప్లైంట్ ఇచ్చారని అంటున్నారు. అయితే అపీషీయల్ గా ఈ విషయమై ఎవరూ పెదవి విప్పటానికి ఆసక్తి చూపటం లేదు.

ఇక వెంకటేష్‌ వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించారు. రాజకీయ నేతగా మాత్రం ఆయన తెరపై ఎప్పుడూ కనిపించలేదు. ఆ ముచ్చట త్వరలోనే తీరబోతోంది. వెంకటేష్‌ కథానాయకుడిగా యూనివర్సల్‌ మీడియా పతాకంపై 'రాధా' అనే చిత్రం తెరకెక్కబోతోంది. నయనతార కథానాయిక. మారుతి దర్శకత్వం వహిస్తారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. జనవరి 16న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ హోం మంత్రి పాత్రలో కనిపించి అలరించబోతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''మారుతి తయారు చేసిన కథ చాలా బాగుంది. కథ వినగానే వెంకటేష్‌గారు ఈ సినిమా చేయడానికి తన అంగీకారం తెలిపారు. నయనతార కూడా కథ, పాత్రలపై ఆసక్తి కనబరుస్తూ నటించేందుకు ముందుకొచ్చింది. హోం మంత్రికీ, ఒక మధ్య తరగతి అమ్మాయికీ మధ్య సాగే ప్రేమాయణమే ఈ చిత్రం. ఇందులో వెంకటేష్‌ హోం మంత్రిగా కనిపించి వినోదం పంచబోతున్నారు. నయనతార మద్య తరగతి అమ్మాయిగా కనిపిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న మూడో చిత్రమిది. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాము''అన్నారు. ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌, సంగీతం: జె.బి., కూర్పు: ఉద్ధవ్‌, సమర్పణ: డి.పార్వతి.

English summary
It is known fact that victory venkatesh is doing a film in the directon of maruthi with title radha is announced long back in april. It is scheduled to start officially from jan 16 2014. But the grapevine in the film nagar circle is, that the story is been taken unofficially from a writer with out his consent not even giving remuneration or credit for his work. Let us see what happen. A few months hero venkatesh offered direction chance to a wannabe director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu