Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhanush తో వెంకీ అట్లూరి సినిమా.. హాట్ హీరోయిన్‌తో, క్రేజీ టైటిల్ ఏమిటో తెలుసా?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా విలక్షణ నటుడు ధనుష్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీగా మారింది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన వివరాలు మీడియాలో ఆసక్తిగా మారింది. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి విభిన్నమైన చిత్రాలను తన దర్శకత్వ ప్రతిభతో హిట్లు ఇండస్ట్రీకి అందించారు. తన నాలుగో సినిమాగా ధనుష్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ను అందించబోతున్నారు.
అయితే ఈ సినిమా పేరును క్రేజీగా ఖరారు చేసినట్టు సమాచారం మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ సినిమా పేరు సర్ (SIR) అనే టైటిల్‌ను పెట్టినట్టు తెలుస్తున్నది. అయితే ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.

ధనుష్‌తో తెరకెక్కించే సినిమా కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉందనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధనుష్ ఈ కథను మరో లెవెల్‌ను తీసుకువెళ్లడం ఖాయమనే వాదనను బలంగా వినిపిస్తున్నారు.
సితార బ్యానర్‌లో 14వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను డిసెంబర్ 23న 9.36 గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.