For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరోనా ఎఫెక్ట్.. స్టార్ డైరెక్టర్‌‌కు అసిస్టెంట్‌గా చేరిన యంగ్ డైరెక్టర్

  |

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి నేపథ్యంలో మునుపెన్నడూ చోటుచేసుకోని చాలా అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటే టాలీవుడ్లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. రెండు సినిమాలు చేసి అవి కూడా హిట్ కొట్టిన దర్శకుడు ఇప్పుడు తిరిగి తాను దర్శకత్వం నేర్చుకున్న గురువుగారి దగ్గరికి వెళ్లి అసిస్టెంట్గా పని చేస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు ? కుర్ర డైరెక్టర్ ఎవరనే వివరాల్లోకి వెళితే..

  కరోనా దెబ్బేసింది

  కరోనా దెబ్బేసింది


  ప్రస్తుతం కరోనా దారుణమైన పరిస్థితులను కళ్లముందు ఉంచుతోంది.. ఇప్పటికే భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక కుర్ర డైరెక్టర్ తనకు విద్య నేర్పిన గురువు దగ్గరకు వెళ్లి అసిస్టెంట్ గా జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

  బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు

  బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు

  ఆ దర్శకుడు మరెవరో కాదు చలో, భీష్మ లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల. చలో సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా హిట్ కొట్టిన ఆయన తర్వాత సినిమా అనౌన్స్ చేసే అవకాశం లభించలేదు.. ఈ దర్శకుడిని అప్పట్లో చిరంజీవి ఇంటికి పిలిచి అభినందించడంతో ఇంకేముంది చిరంజీవితో సినిమా చేస్తున్నాడనే ప్రచారం జరిగింది.

  చేస్తే బడా హీరోతోనే

  చేస్తే బడా హీరోతోనే


  ఆ తర్వాత లేదు రామ్ చరణ్ తో ఆయన సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం జరిగింది, అది కూడా నిజం కాకపోగా తర్వాత మహేష్ బాబుతో సైతం సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ముందు వార్తలు లాగానే ఇది కూడా ఒక పుకారుగానే మిగిలిపోయింది. అయితే ఈ విషయాలు పక్కన పెడితే ఈసారి కచ్చితంగా స్టార్ హీరోతోనే సినిమా చేయాలని భీష్మించుకుని కూర్చున్నారట ఈ భీష్మ డైరెక్టర్.

   రెండు మూడేళ్ల దాకా..

  రెండు మూడేళ్ల దాకా..


  అయితే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు కాదు కదా చిన్న హీరోలు సైతం ఖాళీగా లేరు. చిన్న హీరోల సంగతి పక్కన పెడితే స్టార్ హీరోలందరూ ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేసి ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ దర్శకుడికి మళ్లీ దర్శకత్వం చేసే అవకాశం రావాలంటే మరో రెండు మూడేళ్ల దాకా ఆగాల్సిన పరిస్థితి.

  Vijay Devarakonda Rejected Star Directors Deal | Liger Movie || Filmibeat Telugu
  రిస్క్ ఎందుకని

  రిస్క్ ఎందుకని

  ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో అన్ని ఏళ్ళు ఆగి ఏమి చేస్తాను అన్న ఉద్దేశంతో వెంకీ కుడుముల తనకు దర్శకత్వం నేర్పించిన గురువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దకు వెళ్లి కొన్నాళ్లు ఆయన వద్దనే పని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేస్తూ ఉండగా ఆ స్క్రిప్ట్ కోసం వెంకీ కుడుముల కూడా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మళ్లీ కరోనా పరిస్థితులు ఎప్పటికీ సెట్ అవుతాయో ? మళ్ళీ ఈయన ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తారో వేచి చూడాలి.

  English summary
  After scoring two back-to-back hits with Chalo and Bheeshma, young director Venky Kudumula has not locked his next project yet. He wants to work with star heroes this time but as of now, no one is available to work with him as everyone is already committed with projects. Some reports say that Venky Kudumala have headed back to his guru Tollywood’s ace director, Trivikram Srinivas. As per the buzz, the young director is now said to be acting as an assistant to Trivikram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X