Don't Miss!
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతితో యంగ్ హీరో పాన్ ఇండియా సినిమా!
ఈ మధ్యకాలంలో సినిమా మార్కెట్ అనేది విస్తృతం అయిపోయింది. కేవలం నటీనటులు దర్శక నిర్మాతలు ఒకే భాషకు పరిమితం కాకుండా సినిమాను వీలైతే రెండు మూడు బాషల్లో లేదా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. తాజాగా అలాంటి ఒక పాన్ ఇండియా సినిమా రేపు అధికారికంగా ప్రకటన రాబోతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తమిళ సినిమా పరిశ్రమలో మక్కల్ సెల్వన్ గా పిలువబడుతున్న విజయ్ సేతుపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. చిన్న పాత్రలు చేయడం మొదలు పెట్టి ప్రస్తుతం ఆయన స్టార్ హీరో రేంజ్లో తమిళ సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఆయన నటనకు తమిళ సినిమా ఇండస్ట్రీలో కాకుండా దక్షిణాది మొత్తంలో ఫాన్స్ ఏర్పడ్డారు.. అందులో భాగంగానే తెలుగులో ఉప్పెన సినిమాతో అయిన డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి అందులో రాయలం అనే పాత్ర చేసి నటించి మెప్పించాడు.
ఇప్పుడు ఆయన తెలుగులో మరో హీరోతో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే అది పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కాబోతున్న సంచలనంగా మారింది. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు విజయ్ సేతుపతి సందీప్ కిషన్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం సందీప్కిషన్ ప్రకటన చేయగా రేపు సినిమా అధికారికంగా ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. ఈ సినిమా తమిళ తెలుగు భాషల్లోనే కాక పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది అని అంటున్నారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విజయ్ సేతుపతి ఉప్పెన, మాస్టర్ వంటి సినిమాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. మరి ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడా లేక విలన్ తో సరిసమానమైన ఏదైనా పాత్రలో నటిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

నిజానికి సందీప్ కిషన్ ఏ వన్ ఎక్స్ప్రెస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా త్వరలో గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.. మరో పక్క విజయ్ సేతుపతి కూడా తుగ్లక్ దర్బార్ అనే ఒక తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక అలాగే ఆయన నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇదే సినిమాలో సమంత కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సందీప్ కిషన్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ కరణ్ జోహార్ కలిసి నిర్మించబోతున్నారు అని అంటున్నారు. నిజానికి విజయ సేతుపతి మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి రంజిత్ జయకోడి అనే ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ రూపకర్తలు అయిన రాజ్ అండ్ డీకే ఈ సినిమాకి గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు.