»   » అనుష్కతో మళ్లీ దొరికిపోయిన విరాట్ కోహ్లి!

అనుష్కతో మళ్లీ దొరికిపోయిన విరాట్ కోహ్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: విరాట్ కోహ్లి...ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ఫాంతో ప్రిన్స్‌లా వెలిగిపోతున్నాడు. టాలెంటుతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు పలువురు బాలీవుడ్ ముద్దుగుమ్మలను కూడా ఆకర్షిస్తున్నాడు. సారా జేన్ డియాస్‌తో విడిపోయిన తర్వాత కోహ్లీ మరో హీరోయిన్ అనుష్క శర్మకు దగ్గరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఇటీవల ఓ షాంపూ యాడ్ ఫిల్మ్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు దగ్గరయ్యారని టాక్.

గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల డిసెంబర్ 31 వేడుకల్ని అనుష్క ఇంట్లో జరుపుకుని వార్తల్లో నిలిచిన విరాట్ కోహ్లి...తాజాగా భారత జట్టు న్యూజిలాండ్ టూర్‌కి ప్రయాణం అయ్యే ముందు కోహ్లి మళ్లీ ఒక రాత్రం అనుష్క ఇంట్లో గడిపినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Anushka Sharma-Virat Kohli

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనమని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్క ఇటీవల ముంబైలో కొత్తగా కొనుగోలు చేసిన బద్రీనాథ్ టవర్స్ లోని అపార్టుమెంటులో వీరు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి వీరి వ్యవహారం ఇంకా ఎంత దూరం వెలుతుందో చూడాలి.

గతంలో విరాట్ కోహ్లి మాజీ మిస్ ఇండియా సారా జేన్ డియాస్‌తో కొంత కాలం పాటు డేటింగ్ చేసాడు. అయితే వారి డేటింగ్ కేవలం పార్టీల వరకే సాగింది. అయితే తాజాగా అనుష్క శర్మతో విరాట్ కోహ్లి డేటింగ్ హద్దులు దాటి సహజీవనం వరకు వెళ్లడం చర్చనీయాంశం అయింది.

English summary
According to the recent buzz in B-town, Kohli, before flying off to New Zealand with his team on Sunday, stayed with Anushka Sharma at her Badrinath Towers residence where the actress recently bought property.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu