»   » చిరు 150 మరింత ఆలస్యం?: ‘కత్తి’ కాదు కొత్త కథ!

చిరు 150 మరింత ఆలస్యం?: ‘కత్తి’ కాదు కొత్త కథ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించిన వార్తలు ఏళ్ల తరబడి వినీ వినీ అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు విసుగెత్తి పోయారు. ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో తమిళంలో హిట్టయిన 'కత్తి' రీమేక్ అని ఫిక్స్ అయింది. రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. చిరంజీవి మళ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కత్తి స్ర్కిప్టుని ప‌క్క‌న పెట్టి‌ కొత్త కథతో చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. కత్తి కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేయడంలో వినాయక్ కొన్ని రోజులుగా బిజీగా ఉన్నారు. వాస్తవానికి కత్తి కథ చిరంజీవికి పూర్తి స్థాయిలో నచ్చలేదు. సెకండాప్ చిరు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా లేక‌పోవ‌డంతో వినాయ‌క్ ప‌లు మార్పులు చేశాడు. కానీ.. చిరుకి అవేం సంతృప్తిగా అనిపించ‌లేదట.

VV Vinayak new story for Chiranjeevi 150

అయితే ఈక్రమంలో వినాయక్ ఓ కొత్త కథను చిరంజీవికి వినిపించారని....ఆ కథ కత్తి కంటే బాగా నచ్చడంతో దాన్నే 150వ సినిమాగా చేయాలని అనుకుంటున్నారట. ఈ కొత్త కథను మళ్లీ పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన చిరంజీవి 150వ సినిమా మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

2016లో చిరంజీవి 150వ సినిమా చూస్తామని ఆశ పడుతున్న అభిమానులు తమ ఆశలపై నీళ్లు చల్లుకోవడమే బెటర్. ఎందుకంటే ఈ సంవత్సరం చిరంజీవి సినిమా మొదలైనా విడుదలయ్యే అవకాశం మాత్రం లేదు. అన్నీ అనుకూలంగా జరిగితే వచ్చే ఏడాది సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Film Nagar source siad that, VV Vinayak looking new story for Chiranjeevi 150th movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu