»   » వాస్తవానికి పవన్ దూసుకెళ్లాలి, కానీ...!

వాస్తవానికి పవన్ దూసుకెళ్లాలి, కానీ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'దూసుకెళ్తా' మూవీ నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు వీరూ పోట్ల ఈ చిత్రాన్ని తొలుత పవన్ కళ్యాణ్‍‌తో చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల పవన్ ఆ సినిమా చేయడానికి నో చెప్పాడట.

Veeru Potla Approached Pawan Kalyan

స్క్రీన్ రైటర్‌గా కెరీర్ మొదలు పెట్టిన వీరూ పోట్ల...మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'బిందాస్' చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత నాగార్జునతో తీసిని 'రగడ' చిత్రం కూడా హిట్ కావడంతో....పవన్ కళ్యాణ్ కోసం 'దూసుకెళ్తా' స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ నో చెప్పడంతో వేరే హీరో కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి చివరకు మంచు విష్ణుతో ఆ సినిమా పూర్తి చేసాడట.

పవన్ కళ్యాణ్ ఆ కథ రిజెక్ట్ చేయడం మంచు విష్ణుకు కలిసొచ్చిందని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల వల్ల ఇతర హీరోలు లాభ పడ్డ సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయనే వాదన ఉంది. పూరి-రవితేజ కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు పవర్ స్టార్ కోసం రెడీ చేసినవేనంట. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో..?

English summary
Telugu movie Doosukeltha starring Vishnu Manchu and Lavanya Tripathi in leads, has hit the screens on October 17 and got good opening at the Box Office. Of late, an interesting news is doing rounds in the film nagar. The 
 buzz is that director Veeru Potla initially wanted to do this movie with Power Star Pawan Kalyan. He had even approached the actor with the story, but the latter rejected it over some unknown reason.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu