»   » ‘ఎవడు’ రిలీజ్ అంత వెనక్కా?

‘ఎవడు’ రిలీజ్ అంత వెనక్కా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం జులై 31, ఆ తర్వాత అక్టోబర్ 10 విడుదల అవుతుందంటూ రిలీజ్ తేదీలు ఇచ్చారు కానీ కాలేదు. రకరకాల కారణాలతో ఈ చిత్రం విడుదల చేయటం లేదని, ముందుగా రామయ్య వస్తావయ్యా చిత్రం వస్తు్ందని నిర్మాత ప్రకటన చేసారు. ఈ నేఫద్యంలో ఎవడు విడుదల తేదీపై రకరకాల ప్రచారాలు మీడియాలోనూ,ఫిల్మ్ సర్కిల్స్ లోనూ జరిగాయి. ఫ్యాన్స్ దీపావళికి విడుదల అవుతుందని భావిస్తున్నారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'ఎవడు' విడుదల ని క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ లోగా రాష్ట్రంలో ఉన్న అనిశ్చితి సర్దుకుంటుందని భావిస్తున్నారు.


వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు సినిమా తెరకెక్కింది. శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మాత. ఈచిత్రంపై మెగా ఫ్యామిలీ పూర్తి నమ్మకంతో ఉంది. ఆడియో వేడుకలో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

'ఎవడు' త్వరలో విడుదలవుతుంది. అల్లు అర్జున్‌కి జంటగా నటిస్తున్నాను. ఇందులో నాది చిన్న పాత్రే అయినా బాగుంటుంది. కథలో నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సినిమాలో వచ్చే మార్పులు కీలకమని కాజల్ చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ఎవడు చిత్రంలో ఆమె అల్లు అర్జున్ సరసన చేస్తోంది. గెస్ట్ రోల్ కోసం ఈ చిత్రంలో ఆమెను తీసుకున్నారు. ఆమె పాత్ర నచ్చి, చిన్నదైనా చేసానని చెప్తోంది.


'ఎవడు' చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ...ఓ విషయంలో మాత్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్మడు పోయినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రూ. 3.60 కోట్లు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడయినట్లు టాక్. చిరంజీవికి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ఇంత భారీమొత్తం వెచ్చించి థర్డ్ పార్టీగా కొనుగోలు చేసాడని, దీన్ని ఆయన హిందీ ఎంటర్టెన్మెంట్ చానల్స్‌కు మరింత భారీ రేటుకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

English summary
Ram Charan starrer Yevadu seems to be taking forever to release. Dil Raju also told that he would announce the release date after weighing the pros and cons. The political conditions in the state were not favourable, he says. Dil Raju is more interested in releasing the film in December . Probably this film will have a Christmas release.
Please Wait while comments are loading...