»   » మెగా హీరో మొహం చాటేస్తున్నాడేంటి?

మెగా హీరో మొహం చాటేస్తున్నాడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు శిరీష్ తాజా చిత్రం కొత్త జంట రీసెంట్ గా రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ప్రమోషన్ తో కొంత గట్టెక్కించాలనే ప్రయత్నం దర్శక,నిర్మాతలు చేస్తున్నారు. అందులో భాగంగా హీరోయిన్ రెజీనా ని దింపారు. ఆమె ఈ సినిమా ని ఓ రేంజిలో పొగడ్తల్లో ముంచెత్తుతూ అన్నీ ఛానెల్స్ లోనూ, న్యూస్ పేపర్లోనూ దర్శనమిస్తోంది. అయితే అసలు ప్రచారం చెయ్యాల్సిన మెగా హీరో అల్లు శిరీష్ మాత్రం బయిటకు రావటం లేదు.

సిగ్గుతో రావటం లేదా, లేక మీడియా ముందుకు వస్తే ఏమన్నా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయమా అని అనుమానపడుతున్నారు. పొలిటికల్ గా తన కుటుంబం గురించి మాట్లాడాల్సి వస్తుందని రావటంలేదు అని కొందరంటున్నారు. అదేం కాదు ఎలాగూ రిలీజయ్యి ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది కదా దాన్ని ఏం మోస్తాం అని ఊరుకున్నాడు అని మరికొందరు అభిమానులు సర్ది చెప్తున్నారు. అలాగే గతంలో ట్విట్టర్ లో రెచ్చిపోయే శిరీష్ ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయాడని చెప్తున్నారు.

Why Allu Sirish not attending Kotha Janta promotion

రెజీనా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... 'కొత్త జంట' ఇప్పటికే రెండుసార్లు చూశా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ కథానాయికకైనా విజయం అత్యవసరం. అది ఈ సినిమాతో దక్కిందని భావిస్తున్నా. శిరీష్‌ సెట్లో చాలా హుషారుగా కనిపించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నాకు తెలుగు నేర్పించిన తొలి గురువు.. మా దర్శకుడు మారుతి. ఏ సన్నివేశానికైనా రెండు మూడు పేజీల డైలాగులు నా చేతిలో పెట్టేవారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థినిలా అవి చదువుతూ కూర్చునేదాన్ని. అలా తెలుగు వచ్చేసింది అంటోంది.

అలాగే ... ఈ సినిమాలో సువర్ణ ఓ స్వార్థపరురాలు. నిజ జీవితంలోనూ అందరికీ ఎంతో కొంత స్వార్థం ఉంటూనే ఉంటుంది. అయితే నేను మాత్రం సువర్ణలాగా స్వార్థపరురాలిని కాదు. మరో కథానాయిక మధురిమతో కలసి నటించా. తాను మంచి ఫ్రెండ్‌ అయిపోయింది. ఇద్దరు కథానాయికలున్న సినిమాల్లో నటించడానికి నాకు అభ్యంతరం లేదు. ఈ సినిమా చూసి బన్నీ నన్ను మెచ్చుకొన్నారు. 'నీతో ఓ సినిమా చేయాలనివుంది' అన్నారు. ఆయనతో కలసి నటించే ఛాన్స్‌ వస్తే.. వదులుకోను. అయితే ఇప్పటి వరకూ ఆ ప్రతిపాదనేదీ రాలేదు అని చెప్పుకొచ్చింది.

English summary
Allu Sirish's Kotha Janta Film released with Flop talk. Allu Sirish not intrested to attend it's promotion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu