»   » ఇలియానాని తీవ్ర నిరాశకి గురి చేసిన విక్రమ్

ఇలియానాని తీవ్ర నిరాశకి గురి చేసిన విక్రమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ ధ్రిల్లర్ '24" ఆగిపోయింది. ఈ చిత్రాన్ని 13బితో సంచలనం సృష్టించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేసారు. ఓ ధ్రిల్లర్ గా రూపొందనుందని, మోహన్ నటరాజన్ నిర్మాతని ప్రకటించారు. అలాగే హరీష్ జయరాజ్ కి సంగీత భాధ్యతలు అప్పచెప్పారు. అయితే మరో నెలలో షూటింగ్ అనగా చివరి నిముషంలో ఇది కాన్సిల్ అయింది. ఇక ఈ చిత్రంలో చేయటం లేదని విక్రమ్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు.అయితే ఎందుకు ఆగిపోయిందనే విషయం ఎవరూ చెప్పటం లేదు. ఇక ఈవిషయమై విక్రమ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ..మొదట విక్రమ్ స్క్రిప్టు అధ్బుతంగా ఉందని ఓకే చేసారు. అయితే చివర నిముషంలో బెటర్ రిజల్ట్ కోసం మరిన్ని మార్పులుతో ఆయన్ని కలిసాను. అయితే విక్రమ్ కీ, ప్రొడ్యూసర్ కీ ఇద్దరికీ ఆ వెర్షన్ నచ్చలేదు. ఇద్దరూ రిప్యూజ్ చేసారు.

దాంతో నేను ఆ సినిమా చేయటం అనవసరమని, మరిన్ని మార్పులు చేయటం కష్టమని బయిటకు వచ్చేసాను. ఇప్పుడు నేను వేరే హీరోని సంప్రదించటానికి సరిపడా మార్పులు స్క్రిప్టులో చేసుకుంటున్నాను అన్నారు. ఇక స్క్రిప్టులో కథకి ఇచ్చిన ప్రాదాన్యత హీరో కి ఇవ్వక పోవటమే విక్రమ్ మైనస్ గా భావించి ఈ సినిమాని ఆపుచేసాడని తెలుస్తోంది. మిగతా వారికి ఈ చిత్రం చేయకపోవటం వల్ల పెద్దగా నష్టపోయేది లేకపోయినా ఇలియానా మాత్రం చాలా నిరాశకు గురి అయిందని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తమిళంలో పెద్ద హీరోతో తెరంగ్రేటం చేద్దామనుకున్న ఇలియానా ఆశలుపై నీళ్ళు పోసినట్లు అయిందని అంటున్నారు.ఆమె తమిళంలో దాదాపు మూడేళ్ళ అనంతరం ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇద్దామనే ప్రయత్నం చేసింది. అప్పట్లో ఆమె రవికృష్ణ సరసన చేసిన చిత్రం ఫ్లాఫ్ అవటంతో ఆమె మళ్లీ అక్కడ సినిమాలు చేయలేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu