»   » ‘ఎవడు' విషయంలో దిల్ రాజు సైలెంట్

‘ఎవడు' విషయంలో దిల్ రాజు సైలెంట్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్‌శంకర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్ . ఈ చిత్రంఅక్టోబర్ 10 న విడుదల చేయటానికి నిర్మాత దిల్ రాజు నిర్ణయించారనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన నిర్మించిన ఎవడు చిత్రం రిలీజ్ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. మొదట అంతా ఎవడు చిత్రమే రిలీజ్ అవుతుందని భావించారు. అయితే అనుకోని విధంగా రామయ్యా వస్తావయ్యా సీన్ లోకి వచ్చింది.

  రామ్ చరణ్ హీరోగా వచ్చిన తుఫాన్ చిత్రం నిర్మాతకు,కొనుక్కున్న వారికి భారి నష్టం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎవడు చిత్రం వెంటనే రిలీజ్ చేయటం అంత సేఫ్ కాదని, కొంత గ్యాప్ ఇద్దామని దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రామయ్యా వస్తావయ్యా చిత్రంలో లో ఎన్టీఆర్‌ని ఓ డైనమేట్‌లా చూపించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు.

  దిల్ రాజు మాట్లాడుతూ...హరీష్ శంకర్ మా సంస్ధలో దర్శకత్వం చేయటం ఇదే తొలిసారి. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన పంచ్ డైలాగులు, ఎమోషన్ల్ లుక్స్ ఈ సినిమాకు హైలెట్ అవుతాయి. మాస్,యూత్ ,ప్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. వినోదానికి పెద్ద పీట వేసాం. ధమన్ మంచి బాణీలిచ్చారు. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం అని చెప్పారు.

  ఇక 'ఎవడు' . ఈ చిత్రం విడుదల విషయమై రోజుకో రూమర్ మీడియాలో ప్రచారంలోకి వస్తోంది. దాంతో అభిమానులు కన్ఫూజ్ అవుతారని భావించిన దిల్ రాజు ఈ విషయమై గతంలో మీడియాకు రిక్వెస్ట్ చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ...-'' 'ఎవడు' ని రైట్ టైమ్ చూసి విడుదల చేస్తాం. అఫీషియల్ ప్రెస్ నోట్ ఇస్తాం. ఈ లోగా విడుదల తేదీ విషయంలో ఏ విధమైన ఊహాగానాలు చేయవద్దని మీడియాని కోరుతున్నాను అన్నారు. అలాగే రెండేళ్లు ఈ సినిమా కోసం శ్రమించాం. ఈ సినిమా చూశాను. కథ విన్నప్పుడు ఎంత ఉద్వేగానికి లోనయ్యానో, చూసినప్పుడు అంతే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగితే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడం ఖాయం'' అని చెప్పారు.

  ఇంతకు ముందు కూడా దిల్ రాజు ....''కొందరు మీడియావాళ్లు మా సినిమా గురించి రాంగ్ వర్డ్స్ వాడుతున్నారు. పవన్‌కల్యాణ్‌కి భయపడి చరణ్ వెనక్కి తగ్గాడని ఇష్టం వచ్చినట్లు రాయడం కరెక్ట్ కాదు. కల్యాణ్ బాబాయ్. చరణ్ అబ్బాయ్. బాబాయిని అబ్బాయి గౌరవిస్తాడు కానీ భయపడడు. ఏ సినిమా అయినా తెరపై చూస్తేనే సత్తా ఏంటో తెలిసేది. నాకు తెలిసి అత్తారింటికి దారేది, ఎవడు... రెండూ పెద్ద హిట్టయ్యే సినిమాలే'' అని 'దిల్' రాజు అన్నారు. అప్పుడు అత్తారింటికి దారేది గురించి ఎవడు చిత్రం వాయిదా వేసారని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆ కామెంట్స్ చేసారు.

  English summary
  Ram Charan's spy thriller Yevadu should have been released long before Zanjeer/Toofan release. However Mega Star Chiranjeevi as a Union Minister pressurised producer Dil Raju to postpone the film. In between Zanjeer/Toofan came and put on no show. While Ywvadu prints are still lying at the laboratory, Dil Raju is showing more interest in releasing his film Ramayya Vastavayya starring NTR.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more