twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాటమరాయుడు వరకు బాగానే ఉన్నారు.. పవన్, రవిప్రకాష్ మధ్య ఎక్కడ చెడింది..?

    |

    Recommended Video

    Pawan Kalyan & Ravi Prakash Had Their Misunderstandings

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత ఆయనపై మీడియా ఫోకస్ ఎక్కువైంది. గత నాలుగేళ్లుగా పవన్ కళ్యాణ్ అటు సినిమాల పరంగా, రాజకీయ పరంగా మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతూ వచ్చారు. తెలుగులో ప్రధాన మీడియా సంస్థలైన టివి9, ఎన్టివి ఛానల్స్ పవన్ కళ్యాణ్ కు బాగా ప్రచారం కల్పించాయి. కానీ ఈ మధ్య కాలంలో టివి9 లో పవన్ కళ్యాణ్ వ్యతిరేకశక్తుల ప్రభావం ఎక్కువవుతోంది. కాటమరాయుడు చిత్ర ఆడియో వేడుకలో టివి9 అధినేత రవిప్రకాష్ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ప్రకటించారు. ఆడియో వేదికపై పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కుపించారు. కానీ అంతలోనే పరిస్థితి మారిపోయింది.దీనిపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇది ఎంత వరకు వాస్తవం అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

    శ్రీరెడ్డి ఇష్యూ పవన్ మెడకు

    శ్రీరెడ్డి ఇష్యూ పవన్ మెడకు

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రల్లో ఏ అంశం జరిగినా అందులోకి పవన్ కళ్యాణ్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. టాలీవుడ్ ని కుదుపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకుంది. దీనిగురించి పవన్ అభిమానులు, సినీరాజకీయ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

    కాటమరాయుడు ఆడియో వేడుకలో

    కాటమరాయుడు ఆడియో వేడుకలో

    కాటమరాయుడు ఆడియో వేడుకకు టీవీ9 అధినేత రవిప్రకాష్, ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ వేడుకలో రవిప్రకాష్ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కు మద్దత్తు ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌పై రవిప్రకాష్ ప్రశంసలు కురిపించారు.

    అంతలోనే ఏం జరిగింది

    అంతలోనే ఏం జరిగింది

    ఇద్దరు ప్రధాన మీడియా అధినేతలు పవన్ కళ్యాణ్ కు అండగా ఉండడంతో జనసేనాని మంచి ప్రచారం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్, రవిప్రకాష్ మధ్య ఏదో జరిగిందని సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    కారణం ఇదేనా

    కారణం ఇదేనా

    పవన్, రవిప్రకాష్ మధ్య విభేదాలు తలెత్తాయని జనాల్లో ఓ ఊహాగానం వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది. అజ్ఞాతవాసి ఆడియో వేడుక ప్రసార హక్కుల విషయంలో పవన్, రవిప్రకాష్ మధ్య విభేదాలు తలెత్తినట్లు ఓ చర్చ జరుగుతోంది. అజ్ఞాతవాసి ఆడియో వేడుక టివి5లో ప్రసారం అయిన సంగతి తెలిసిందే.

    మొన్న కత్తి, నేడు శ్రీరెడ్డి

    మొన్న కత్తి, నేడు శ్రీరెడ్డి

    ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యతిరేక శక్తుల చర్చ కార్యక్రమాలు టీవీ9 లో ఎక్కువ అవుతున్నట్లు సినీరాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మధ్యన కత్తి మహేష్ వివాదం మీడియాలో బాగా హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీరెడ్డి వివాదం మీడియాలో ప్రధాన చర్చగా మారింది. ఈ రెండు వివాదాల్లో టార్గెట్‌గా మారింది పవన్ కళ్యాణే.

    రంగస్థలం సక్సెస్ ఈవెంట్‌లో

    రంగస్థలం సక్సెస్ ఈవెంట్‌లో

    కాటమరాయుడు ఆడియో వేడుకకు రవిప్రకాష్, నరేంద్ర చౌదరి ఇద్దరూ హాజరయ్యారు. కానీ రంగస్థలం సక్సెస్ ఈవెంట్‌లో మాత్రం పవన్ పక్కన నరేంద్ర చౌదరి మాత్రమే కనిపించారు. పవన్ తో ఉన్న విభేదాల కారణంగానే రవిప్రకాష్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    English summary
    Why media targeting Pawan Kalyan. Here is the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X