»   » అమీర్ ఖాన్, రజనీ స్టైల్లో పవన్ కూడా చేస్తే రికార్డులు సృష్టించవచ్చు..!

అమీర్ ఖాన్, రజనీ స్టైల్లో పవన్ కూడా చేస్తే రికార్డులు సృష్టించవచ్చు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్ ఖాన్, రజనీకాంత్ లాంటి వాళ్లే తమ సినిమాలు విడుదలైనప్పుడు వాటిని ప్రచారం చేసుకునేందుకు ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. అలాంటిది ఎప్పటికీ గోడకి కొట్టిన సున్నంలా అలాగే ఉంటానని అంటే ఏ హీరోకీ చెల్లదు. కాలంతో పాటు తాము కూడా మారి జనజీవన స్రవంతిలో కలిసిపోతే తప్ప పనులు జరగవు. పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ తన సినిమా జయాపజాలతో నిమిత్తం లేకుండా దానిని గాలికొదిలేస్తుంటాడు.

తనలానే పబ్లిక్ ఫంక్షన్లు ఇష్టపడని మహేష్ కూడా ఒక్కోసారి తన సినిమా గురించి చాలా మాట్లాడేస్తూ ఉంటాడు. ట్విట్టర్ లాంటి వాటిలో చేరి తన వంతు ప్రచారం చేస్తుంటాడు. కానీ పవన్ మాత్రం ఇవేమీ పట్టనట్టు సినిమాని దేవుడికే వదిలేస్తుంటాడు. ప్రచారం పెద్దగా జరగని సినిమాని ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్నారిప్పుడు. తీసినోళ్లే సైలెంట్ గా ఉన్నారంటే సినిమాలో సరుకు లేదని ఫిక్సయిపోతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ తన పద్థతి మార్చుకుని సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతని కూడా తీసుకోవాలి.

English summary
'Teenmaar' film has been slated to destroy screens on April 14th and still Patch toil is begin ready in place of the film. 'Teenmaar' has to extent Censor Board at the moment but Pawan Kalyan was not content with the progress of film toil. Pawan Kalyan must start promoting his movies,Pawan Kalyan's should take promoting responsibilities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu