»   » కోనకు బైబై, గోపీ మోహన్ కు వెలకమ్, శ్రీను వైట్ల కొత్త స్కూల్

కోనకు బైబై, గోపీ మోహన్ కు వెలకమ్, శ్రీను వైట్ల కొత్త స్కూల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్ని విభేధాలు వచ్చినా, ఎంత పర్శనల్ ఇగోలు వచ్చినా టాలెంట్ ని ఎవరూ కాదనలేరు. టాలెంట్ ఉన్నవారితో పనిచేయటం మానలేరు. ఇప్పుడు రచయిత గోపి మోహన్ విషయంలో అదే నిజం అయ్యిందని తెలుగు సినీ పరిశ్రమలో వినపడుతోంది. వద్దునుకున్న శ్రీను వైట్ల మళ్లీ గోపీ మోహన్ కు కబురు పంపి, తన టీమ్ లోకి తీసుకోవటమే ఇందుకు ఉదాహణ అంటున్నారు. గోపీ మోహన్ లో ఉన్న స్క్రిప్టు నాలెడ్జ్, ఫ్రెండ్ షిప్ నేచురే మళ్లీ శ్రీను వైట్లకు దగ్గర చేసిందంటున్నారు.

గోపీ మోహన్, కోన వెంకట్....వీళ్లిద్దరూ టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ స్క్రిప్టులు రాసారు. ముఖ్యంగా ఈ కాంబనేషన్ కు శ్రీను వైట్ల కలిస్తే సక్సెస్ గ్యారెంటీ అన్నట్లు గా నడిచింది. అయితే ఎన్టీఆర్ తో చేసిన బాద్షా సమయంలో ..సినిమాలో క్రెడిట్స్ విషయమై కోన వెంకట్ కు శ్రీను వైట్లకు చెడటంతో కాంబినేషన్ కొలాప్స్ అయ్యింది.

అంతేకాదు పబ్లిక్ లో శ్రీను వైట్ల, కోన ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకున్నారు. కలిసి పనిచేయకూడని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు తో శ్రీను వైట్ల ఆగడు చిత్రం చేసారు సొంత స్క్రిప్టు తీసుకుని. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

writer Gopimohan back in Sreenu Vaitla School

ఈ సమయంలో శ్రీను వైట్లకు రామ్ చరణ్ డేట్స్ ఇవ్వటం జరిగింది. రామ్ చరణ్ ప్రోత్సాహంతో మళ్లీ ఈ రైటర్స్ తో శ్రీను వైట్ల కలిసి పనిచేసారు.అయితే బ్రూస్లీ చిత్రం అనుకున్న స్ధాయిలో సక్సెస్ ఇవ్వలేకపోయింది. మరో ప్రక్క కోన వెంకట్ ..నిర్మాత గా సక్సెస్ లు సాధిస్తున్నారు.

ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రస్తుతం శ్రీను వైట్ల..మిస్టర్ అనే టైటిల్ తో వరుణ్ తేజ హీరోగా ఓ చిత్రం రెడీ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం గోపీ మోహన్ ని శ్రీను వైట్ల కబురు పంపి తన టీమ్ లోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే కోన వెంకట్ సీన్ లేరని సమాచారం. ప్రస్తుతం గోపీ మోహన్ మిస్టర్ చిత్రానికి పనిచేస్తున్నారు.

English summary
Buzz is thatSreenu Vaitla has now taken Gopimohan and completely cutting out Kona from his camp.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu