»   » పవన్ కళ్యాణ్ సినిమా కోసం రాయనన్నాడు, కారణం ఏమిటి?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం రాయనన్నాడు, కారణం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ లాంటి టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా, టెక్నీషియన్ అయినా, రచయిత అయినా వదులుకోరు. కానీ ఓ రచయిత పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేయమంటే నో చెప్పాడట. అతడు మరెవరో కాదు నటుడు, రచయిత హర్షవర్ధన్.

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యందే, మనం లాంటి చిత్రాలకు పని చేసి తన టాలెంట్ నిరూపించుకున్న హర్షవర్ధన్ తో డైలాగులు రాయించాలని ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం భావించారు. పవన్ కళ్యాణ్ తో తాను తీయబోయే సినిమాకు పని చేయాలని అడిగాడట. అయితే తాను డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్నానని, మళ్లీ సినిమాలకు రచయితగా పని చేయడం మొదలు పెడితే తన డైరెక్షన్ ప్రయత్నాలకు బ్రేక్ పడుతుందని సున్నితంగా తిరస్కరించారట.

 శ్రీముఖి ముఖ్య పాత్రలో మర్ష వర్దన్ మూవీ

శ్రీముఖి ముఖ్య పాత్రలో మర్ష వర్దన్ మూవీ

దర్శకుడిగా మారాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న హర్షవర్ధన్ ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించబోతున్నారు. త్వరలో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రీముఖి ముఖ్యపాత్రలో నటించబోతోందట. పవన్ సినిమా ఒప్పుకుంటే ఈ సినిమా ఆగిపోతుందనే వద్దన్నాడట.

 రెండో సినిమా సుధీర్ బాబుతో

రెండో సినిమా సుధీర్ బాబుతో

హర్షవర్ధన్ మొదటి సినిమా ఇంకా పూర్తి కాలేదు, విడుదలకూడా కాలేదు... తన రెండో ప్రాజెక్టు గురించి కూడా ప్రకటించారు. దర్శకుడిగా తన రెండో సినిమా సుధీర్ బాబు హీరోగా ఉంటుందని ఇటీవల హర్షవర్దన్ వెల్లడించినట్లు సమాచారం.

 హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్

హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్ ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వాడుతున్న ఫోన్ ఏంటో తెలుసా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్... రూ. 65 కోట్లు, అంత సీన్ ఉందా?

చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్... రూ. 65 కోట్లు, అంత సీన్ ఉందా?

త్వరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Writer Harshavardhan was approached to write dialogues for Pawan's project with AM Ratnam. He had to reject the offer of Ratnam as he was planning to turn director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu