Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐశ్వర్యారాయ్‌తో యశ్.. మరో లెవెల్‌కు వెళ్లే అవకాశం.. సెన్సేషనల్ దర్శకుడి ప్లాన్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ అంటే కేవలం శాండిల్ వుడ్‌కు మాత్రమే పరిమితం కాదు. సౌత్ ఇండియా హద్దులు చెరిపేసి బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా వసూళ్లు సాధించే సత్తా గలవాడు. కేజీఎఫ్ లాంటి డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీని సృష్టించాడు. కేజీఎఫ్ సినిమా యశ్ స్టార్ డమ్‌ను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్‌తో బిజీగా ఉండగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

నవాబ్ తరువాత..
ఇండియన్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలంటే ఓ ప్రత్యేక వర్గానికి విపరీతమైన పిచ్చి. ఆయన మేకింగ్‌ను ఇష్టపడని సినీ ప్రేక్షకులు ఉండరు. అయితే గత కొన్నేళ్లుగా మణిరత్నంకు సరైన సక్సెస్ రాలేదు. చివరగా నవాబ్ చిత్రంతో ఓ మోస్తరు విజయం వరించింది. దీంతో తన తదుపరి చిత్రాన్ని మరింత భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు.

పొన్నియన్ సెల్వన్..
నవలా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ తారాగణం నటిస్తోంది. ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా లక్ష్మీ, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాల్ల, అదితి రావ్ హైదరీ, అశ్విన్, జయరామ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

సీన్‌లోకి ఎంటరైన రాకీ భాయ్
పొన్నియన్ సెల్వన్ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్రకు యశ్‌ను తీసుకోవాలని మణిరత్నం భావించారట. అయితే ఇందుకోసం రంగంలోకి దిగిన సుహాసిని.. ఇద్దరికి మధ్య వర్తిత్వం వహించిందంటా. అయితే కథ విన్న యశ్.. నటించేందుకు అంగీకరించాడట.

ఐశ్వర్యా రాయ్ బంధువుగా..
అయితే ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బంధువు, పాండ్య రాజుగా యశ్ కనిపించిబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి కేవలం ముప్పై రోజుల కాల్షీట్స్ మాత్రమే అది కూడా మే నెలలోనే ఇచ్చినట్టు టాక్. కానీ కరోనా వైరస్ వచ్చి పడటంతో అన్నింటికి బ్రేక్ పడింది. లేదంటే ఈ పాటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేది. యశ్ ఎంట్రీతో ఈ మూవీ మరో లెవెల్‌కు వెళ్తుందని టాక్.