»   » నందినీరెడ్డి ప్లాన్ - రానాను హీరో చేద్దామనా?

నందినీరెడ్డి ప్లాన్ - రానాను హీరో చేద్దామనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, హాట్ లేడీ దీపిక పడుకొనె హీరో హీరోయిన్లుగా రూపొందిన హిందీ చిత్రం 'యే జవానీ హై దివానీ' ప్రస్తుతం విడుదలై హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు కోట్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మన తెలుగు హీరో రానా ఓ చిన్న గెస్ట్‌రోల్‌లో కనిపించాడు.

తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఓ పుకారు ఏమిటంటే....'యే జవానీ హై దివానీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయని, ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనుందని, అక్కడ గెస్ట్‌రోల్‌లో కనిపించిన హీరో రానాను ఇక్కడ హీరోగా చూపిద్దామనే ప్రయత్నం జరుగుతోందని, సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే ఈ వార్త ప్రస్తుతానికి పుకారు మాత్రమే, ఈ విషయమై రానాగానీ, నందినీ రెడ్డిగానీ స్పందించి అధికారిక ప్రకటన చేస్తే తప్ప ఇందులో నిజం ఎంతో తేలే అవకాశం లేదు. చూద్దాం ఏం జరుగబోతోందో. ప్రస్తుతం రానా గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి చిత్రంలో కథానాయకుడుగా నటిస్తున్నాడు. అదే విధంగా రాజమౌళి 'బాహుబలి' చిత్రంలో నటించనున్నాడు.

ఇక 'అలా మొదలైంది' చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన నందినీరెడ్డి, ఆ తర్వాత సిద్దార్థ హీరోగా 'జబర్దస్త్' చిత్రాన్ని తీసినప్పటికీ ఆ చిత్రం అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. త్వరలో ఆమె నితిన్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

English summary
Filmnagar Rumor is that, Nandini Reddy will be wielding megaphone for the Telugu remake of Yeh Jawaani Hai Diwaani. Suresh Babu long ago had paid advance to Nandini Reddy to direct a movie on his banner. And now reports suggest that his son Rana may star in this remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu