»   » ‘ఎవడు’ సినిమాలో మార్పులు, రీ షూట్?

‘ఎవడు’ సినిమాలో మార్పులు, రీ షూట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'ఎవడు' చిత్రంలో మార్పులు చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఇటీవల విడుదలైన 'తుఫాన్' చిత్రం ప్రేక్షకులు తిరస్కరించడానికి సినిమాలోని కొన్ని చెత్త సీన్లే కారణం. అలాంటి సీన్లే 'ఎవడు'లో ఉండటంతో మార్పులు చేయడానికి సిద్ధపడినట్లు సమాచారం.

ఈ మేరకు సినిమాలోని కొన్ని సీన్లు రీ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లు. జులై 31న ఈచిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేసినప్పటికీ...రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల నిలిపి వేసారు.

రీ షూట్ పనులు పూర్తయ్యాక సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తుండటం మరో విశేషం. అల్లు అర్జున్‌కి జోడీగా హీరోయిన్ కాజల్ కూడా గెస్ట్ రోల్‌లో నటించింది. ఇప్పటికే ఈచిత్రం ప్రివ్యూ చూసిన చిరంజీవి చరణ్ కెరీర్లో ఇదొక పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

ఎవడు' చిత్రం విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ...ఓ విషయంలో మాత్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంకా విడుదల కానప్పటికీ హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్మడు పోయినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం రూ. 3.60 కోట్లు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడయినట్లు టాక్. చిరంజీవికి సన్నిహితుడైన గంటా శ్రీనివాసరావు ఇంత భారీమొత్తం వెచ్చించి థర్డ్ పార్టీగా కొనుగోలు చేసాడని, దీన్ని ఆయన హిందీ ఎంటర్టెన్మెంట్ చానల్స్‌కు మరింత భారీ రేటుకు అమ్మాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, some minor changes are being made in Ram Charan’s ‘Yevadu’. After the disappointment of ‘Thoofan’, the makers are not willing to take any chances and therefore, special care is being taken for this movie.
Please Wait while comments are loading...