»   » రామ్ చరణ్ 'ఎవడు' రిలీజ్ వాయిదా...కొత్త డేట్

రామ్ చరణ్ 'ఎవడు' రిలీజ్ వాయిదా...కొత్త డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 25 న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు జూలై 31 కి మారే అవకాసం ఉందని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ లో డిలే వల్ల రిలీజ్ వాయిదా వేసే అవకాసం ఉందని తెలుస్తోంది.

ఈ డేట్ ఛేంజ్ అనేది నిజమే అయితే మిగతా సినిమాల విడుదలలు కూడా మారే అవకాసం ఉంది. ఇటీవలే రెండు పాటల్ని స్విట్జర్లాండ్‌, బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరాయి.


దిల్‌ రాజు మాట్లాడుతూ ''వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. చరణ్‌ నటన, నృత్యాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు''అన్నారు.

చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా మగధీరను మించిన హిట్టవుతుందని స్పష్టం చేసారు. మగధీర తర్వాత ఆ రేంజి హిట్టయ్యే సినిమా 'ఎవడు' మాత్రమే. మగధీరకు ఏమాత్రం తీసి పోని సినిమా ఇది, మగధీర తర్వాత ఇంత తక్కువ సమయంలో ఎవడు లాంటి సినిమా చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టమే. అభిమానులు ఏ రేంజిలో ఊహించుకున్నా ఆ రేంజిని అందుకునే సత్తా ఉన్న సినిమా ఎవడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

English summary

 Ram Charan's Yevadu is likely to be released on July 31st. Official statement is yet to be made, though. Earlier, producer Dil Raju planned to release the movie on July 25th. Change in the release date is attributed to delay in post production work. Also there is a sentiment. Ram Charan's biggest blockbuster Magadheera was also released on July 31st.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu