»   » ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాతకే ట్విస్ట్ ఇచ్చిన యంగ్ హీరో

ఇంట్రడ్యూస్ చేసిన నిర్మాతకే ట్విస్ట్ ఇచ్చిన యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

అష్టాచెమ్మా చిత్రంతో తనను పరిచయం చేసిన నిర్మాత రామ్మోహరావు కే యంగ్ హీరో నాని ట్విస్ట్ ఇచ్చాడంటూ పరిశ్రమలో వినపడుతోంది. రామ్మోహనరావు రీసెంట్ గా ఉయ్యాల జంపాల అనే స్క్రిప్టుతో నానిని కలిసి డేట్స్ అడిగారు. విరించి అనే నూతన దర్శకుడు ని పరిచయం చేస్తూ ఈ సినిమా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యి నానిని సంప్రదించారు. అయితే నాని మాత్రం తన డేట్స్ ఖాళీ లేవని ఇమ్మిడియట్ గా చెప్పారుట.అంతేగాక స్క్రిప్టు లో కొన్ని సూచనలు సైతం చేసారని తెలుస్తోంది.

దాంతో రామ్మోహరావు చాలా నిరాశ చెందారని చెప్పుకుంటున్నారు. నాని కి ఇప్పుడు పరిశ్రమలో కథ చెప్పాలంటేనే భయపడే స్ధితి ఏర్పడిందని ఓ టాక్ గత కొంత కాలంగా వినపడుతోంది. అలా మొదలైంది చిత్రం తర్వాత నాని తనలో ఉన్న డైరక్షన్ స్కిల్స్ ని బయిటకు తీసుకువచ్చి ఇలా ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నాని ..రాజమౌళి దర్శకత్వంలో ఈగ చిత్రం చేస్తున్నారు. నాని సరసన సమంత హీరయిన్ గా చేస్తోంది.

English summary
roducer Ram Mohan who made ‘Ashta Chamma’ reportedly approached Nani for his new project titled ‘Uyyala Jampala’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu