యువ రాజకీయ నేతతో తెలుగు నటి పెళ్లి.. బెంగళూరులో సహజీవనంతో..
తెలుగు సినిమా వరల్డ్ తో పాటు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ట్రెండింగ్ టాపిక్ ఉంటూనే ఉంటుంది. అయితే సోషల్ మీడియా ప్రారంభమైన నాటి నుంచి క్షణానికో వార్త వైరల్ గా మారుతూ వస్తోంది. నమ్మశక్యంగా లేని విధంగా పుకార్లు షికార్లు చేస్తూ ఉంటున్నాయి. అలాగని వాటిని నమ్మడానికి లేదంటే కుదరదు. గతంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చిన అంశాలు నిజమై తీరాయి కూడానూ. అందుకు ఉదాహరణలు కోకొల్లలు. అయితే తాజాగా ఒక యంగ్ పొలిటిషీయన్, తెలుగు యంగ్ నటి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా పుకార్లు పుట్టుకొచ్చాయి.
ఏపీకి చెందిన ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ పొలిటీషియన్ ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఆ వార్త సారాంశం. రాజకీయాల్లో మంచి పట్టు సాధించిన ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. నెక్ట్స్ శాసన సభ్యుడిగానూ ఎన్నికయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయి. రాజకీయం పరంగా ఆయన భవిష్యత్ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు సామాజిక అంశాలు, ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో తనదైన శైలిని కనబరుస్తూ ఉంటారు. ఇక ఆయన ఇప్పటి వరకు బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేశారు.

ఎట్టకేళలకు ఆ యువ రాజకీయ నాయకుడు పెళ్లి చేసుకోబోతున్నారని, అది కూడా తెలుగు నటితో వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్నాళ్లు ఆఫ్ స్క్రీన్ సంచలనం సృష్టించింది. ఆమె ఇంటర్వ్యూలు, పలు సమస్యలపై తను పోరాడిన తీరుతో భారీ ఫాలోయింగ్ ను దక్కించుకుంది. పలు ట్రోల్స్ ను కూడా ఎదుర్కొంది. అయితే వీరిద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నారని, అలా ఏర్పడిన పరిచయంతో దగ్గరయ్యారని ప్రచారం జరుగుతోంది.
ఇక వీరిద్దరూ 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని కూడా రూమర్. పొలిటీషియన్ ఇంట్లో ఆ తెలుగు నటితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇద్దరు సహజీవనం చేస్తున్నారని, ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. మొదట తమ ఇంట్లో ఒప్పుకోకపోయినా తర్వాత ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కొనసాగిస్తున్నారని అంటున్నారు. గతేడాది నుంచే వీరు పెళ్లికి రెడీ అవుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సదరు పొలిటీషియన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి ఆమెతో పెళ్లి అవాస్తవమని తెలుపుతున్నారు. ఎవరో కావాలనే ఇలాంటి రూమర్లను సృష్టిస్తున్నారని చెబుతున్నారు.
దీనిపై ప్రస్తుతం సదరు పొలిటీషియన్ గానీ, సదరు నటిగానీ స్పందించలేదు. సోషల్ మీడియాలో మాత్రం వార్త వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇవన్నీ ఫేక్ సమాచారమని, ఎవరూ నమ్మొదని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. దీనిపై మున్ముందు వారు ఎలా స్పందిస్తారనేది చూడాలని అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. వారి పెళ్లి వార్తలపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏమాత్రం నమ్మ శక్యంగా లేదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











