లగాన్‌ను ఆ సినిమా దెబ్బ తీసింది.. కలెక్షన్ల సునామీ చూసి వణికిపోయాం.. అమీర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లగాన్ చిత్రం జూన్ 15వ తేదీకి 20 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా తన సినిమా గురించిన విశేషాలు తెలియజేస్తూ.. లగాన్ కలెక్షన్లను దెబ్బ తీసిన చిత్రం గురించి విపులంగా మీడియాకు వెల్లడించారు. లగాన్ సినిమా రిలీజ్‌ సమయంలోనే సన్నిడియోల్, అమీషా పటేల్ నటించిన గదర్: ఏక్ ప్రేమ కహానీ చిత్రం విడుదలైంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశభక్తి ప్రధానంగా, నేపథ్యంగా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

గదర్: ఏక్ ప్రేమ్ కహానీకి వచ్చిన స్పందన చూసి మేమంతా షాక్ తిన్నాం. ఆ సినిమా చూడటానికి ప్రేక్షకులు వాహనాలు, ట్రక్కుల్లో వస్తున్నారనే వార్త విని ఆశ్చర్యపోయాం. ఆ సినిమా లగాన్ కలెక్షన్లను ఉత్తర భారత దేశంలో భారీగా దెబ్బ తీసింది. గదర్ సినిమా సన్నీడియోల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయాన్ని మాకు ఎవరు చెప్పలేదు. దాంతో మా రిలీజ్ వాయిదా వేసుకొనే అవకాశమే లేకపోయింది అని అమీర్ ఖాన్ తెలిపారు.

Aamir Khan about 20 years of Lagaan and Gadar: Ek Prem Katha craze

గదర్ సినిమా భారీగా హిట్ కావడానికి కారణం ఆ సినిమా కథ, స్క్రిప్టు మాత్రమే. సన్నిడియోల్ నటన దానికి మరింత తోడై థియేటర్లలో సునామీ సృష్టించింది. కొన్ని రాష్ట్రాల్లో ఆ సినిమా వల్ల లగాన్ వెలవెలబోయింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి లగాన్‌కు మద్దతు లభించడంతో కాస్త ఉపశమనం దక్కింది అని అమీర్ ఖాన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X