For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాయి పల్లవికి నేను ఫ్యాన్ అయ్యా.. చైతు పేరెంట్స్‌కు ఆ విషయం చెప్పాలనుకొన్నా.. అమీర్ ఖాన్

  |

  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు నిర్మాతలుగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ...

   నేనే లవ్ స్టోరి ఈవెంట్‌కు వస్తానని చెప్పా

  నేనే లవ్ స్టోరి ఈవెంట్‌కు వస్తానని చెప్పా

  లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. నాలుగు రోజుల క్రితం సాయిపల్లవి, నాగచైతన్య సినిమా లవ్ స్టోరి ట్రైలర్ చూశాను. చాలా బాగుందని చైతుకు మెసేజ్ పంపించాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని తెలిసి నేను రావొచ్చా అని అడిగాను. దాంతో నిర్మాత, దర్శకులు బలవంతంగా ఈ ఈవెంట్‌కు పిలువాల్సి వచ్చింది అని అమీర్ ఖాన్ అన్నారు. కానీ ఇక్కడికి రావడానికి మరో బలమైన కారణం ఉంది అని తెలిపారు.

   లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతుతో కలిసి

  లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతుతో కలిసి

  నేను, నాగచైతన్యతో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నాం. ఆ సమయంలో చైతూ ప్రవర్తన, నడవడికి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అందుకే మీ తల్లిదండ్రులకు ఓ మాట చెప్పాలని అనుకొన్నాను. ఆ మేరకు చైతు తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మీ ఫోన్ నంబర్ తీసుకొన్నాను. కానీ హైదరాబాద్‌కు వచ్చి చైతుకు చెప్పాలనుకొన్నాను. కానీ చైతు ఫ్యామిలీ, ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. అందుకే ఈ వేదిక నుంచి చైతు గురించి చెబుతున్నాను అని అమీర్ ఖాన్ అన్నారు.

   చైతు నటుడే కాదు... మంచి మనసున్న వ్యక్తి

  చైతు నటుడే కాదు... మంచి మనసున్న వ్యక్తి

  నాగచైతన్య ఓ నటుడే కాదు. మంచి మనసున్న మనిషి. ఆ రెండు లక్షణాలు నన్ను కట్టిపడేశాయి. అందుకు చైతు తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగు మొదటి రోజున చైతును కలిసినప్పుడు కొత్త వ్యక్తిని కలిసాననే ఫీలింగ్ రాలేదు. ఎన్నో రోజులుగా పరిచయం ఉన్న అత్యంత సన్నిహితుడుగా అనిపించాడు. గొప్ప లక్షణాలు ఉన్న కుమారుడిని నాకు పరిచయం చేసినందుకు చైతు తల్లిదండ్రులను ప్రశంసిస్తున్నాను అని అమీర్ ఖాన్ అన్నారు.

  సెప్టెంబర్ 24వ తేదీన లవ్ స్టోరి చూస్తా

  సెప్టెంబర్ 24వ తేదీన లవ్ స్టోరి చూస్తా

  లవ్ స్టోరి సిననిమా 24 తేదీన రిలీజ్ అవుతుందని తెలుసు. నేను అదే రోజు సినిమాను థియేటర్లలో చూస్తాను. మహారాష్ట్రలో థియేటర్లు మూసివేత ఉంది. కానీ ప్రైవేట్ స్క్రీనింగ్ కోసం పర్మిషన్ తీసుకొని సినిమాను సెప్టెంబర్ 24వ తేదీన చూస్తాను. అంతకు ముందు గానీ,. ఆ తర్వాత గానీ చూడను అని అమీర్ ఖాన్ తెలిపారు. శేఖర్ కమ్ముల గురించి ప్రతీ ఒక్కరు చెప్పిన మాటలు నన్ను ఆకట్టుకొన్నాయి. నేను గొప్ప ఫిల్మ్ మేకర్‌ను కలిశాననే ఫీలింగ్ కలిగిందన్నారు

  Naga Chaitanya Samantha విడాకులు వివాదానికి చెక్.. ఎందుకీ లొల్లి !
  సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ను

  సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ను


  సాయి పల్లవి గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఆమె వీడియోలు యూట్యూబ్‌లో చూశాను. అయితే ఆమె సినిమాలు ఇంత వరకు చూడలేదు. అందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను. నేను ఎక్కువగా సినిమాలు చూడను. లవ్ స్టోరి సినిమా ఫస్ట్ క్లిప్ చూసిన తర్వాత నేను ఆమెకు ఫ్యాన్ అయ్యాను అని అమీర్ ఖాన్ అన్నారు. నిర్మాత సునీల్ నారంగ్‌కు నా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమా యూనిట్ అందరికి నా విషెస్. మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకొంటున్నాను అని అమీర్ ఖాన్ అన్నారు.

  English summary
  Bollywood Super Star Aamir Khan sensational comments on Sai Pallavi and Naga Chaitanya in Love Story unplugged. Chiranjeevi, Aamir Khan graced the Love Story Unplugged Event. In this occassion, Chiranjeevi gets emotional talking about Aamir Khan, Chaitanya Akkineni and Sai Pallavi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X